Krishna Mukunda Murari: ముకుందా మురారి ని చూస్తుందా, ఆదర్శ్ నీ చూస్తుందా అని అనుకుంటుంది. సరే కదా అని ముకుంద వెనుకగా వెళ్లి ముకుంద జల్లెడ వైపు చూస్తే తను కావాలని మురారినే చూస్తుంది ఆదర్శ ని చూడకుండా, అది గమనించి కృష్ణ చాలా బాధపడుతుంది. నీకు తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. ఆ తరువాత అలేఖ్య జల్లెడలో మధును చేస్తుంది.

మురారి కృష్ణ కోసం వెతుకుతూ ఉండగా అలేఖ్య హాల్లో నుంచొని మురారి కృష్ణ కోసం వెతుకుతున్నావా తను ఇప్పుడే ఆరేసిన బట్టలు తీసుకురావడానికి మేడ మీదకు వెళ్ళింది అని చెబుతుంది అవునా అని మురారి మేడ మీదకు వెళ్ళగానే ముకుందా తన రెండు చేతులతో మురారి కళ్ళు మూసుకుంది అది కృష్ణ చేతులు కావాలని తెలుసుకున్న మురారి వెంటనే విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే ముకుంద మురారిని గట్టిగా హద్దుకుంటుంది అయినా తన నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న ముకుందా చాలా గట్టిగా పట్టుకుంటుంది. పెద్ద అత్తయ్య కు మన విషయం చెప్పేసి పెళ్లి చేసుకుందాం అని అంటుంది.

రేవతి అలేఖ్య ఎంటా కంగారుగా ఉందని తన దగ్గరకు వెళ్లి ఏమైంది ఏం జరుగుతుంది అంటే మీరు ఎప్పుడు ఇంతే అత్తయ్య నన్నే అనుమానిస్తారు అని అలేఖ్య అనగానే రేవతి అలేఖ్య చంప చెల్లుమనిపిస్తుంది ఇప్పుడు ఏమైంది చెప్పకపోతే ఇంకో చంప పగిలిద్ది అనగానే ముకుందా మురారిని కృష్ణ పిలిచిందని మేడ మీదకు పంపించండి మేడ మీదకు ఎవ్వరూ రాకుండా నన్ను అడ్డుగా నిలబడమని చెప్పింది అని అనగానే ఇక ఆ విషయం తెలుసుకున్న రేవతి పరుగు పరుగున మేడ మీదకు బయలుదేరుతుంది. అప్పటికే ముకుంద మురారి నీ హత్తుకొని ఉండటం, మురారి తన నుంచి విడిపిచుకోవటానికి ట్రై చేసి మొత్తానికి విడిపించుకుంటాడు మురారి. అప్పుడు రేవతి మురారి నీ ముకుంద ను కోపంగా చూస్తూ దగ్గరకు వస్తుంది. మురారి నీ కొట్టబోతుంది. ముకుంద అడ్డుపడుతుంది. నువ్వు ఆగు అని అంటుంది రేవతి పెద్దగా.. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుంది. ఇదంతా నేనే చేశాను అని అనగానే మురారి నీ ఇక్కడ నుంచి వెల్లిపోమని చెబుతుంది. ముకుంద రేవతి కి రెండు చేతులు జోడించి నమస్తే పెట్టీ నా జీవితం మీరే బాగు చేయాలి అని వేడుకుంటుంది. నా ప్రేమ ఫలించడానికి ఎంతకైనా తెగిస్తా, ఏమైనా చేస్తా అని మనసులో అనుకుంటుంది.

మరోవైపు కృష్ణ ముకుంద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావని శ్రీనివాస్ కంగారు పడతాడు అదేం లేదు బాబాయ్ ముకుంద జీవితం బాగుంటుందని మీరు చెప్పడానికి వచ్చాను అని కృష్ణ అంటుంది లేదమ్మా ఈ మాట ఆరు నెలల క్రితం మీ భవాని అత్తయ్య చెప్పింది మూడు నెలల క్రితం మీ రేవతి అత్తయ్య చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అని శ్రీనివాస్ అంటాడు మాటలు విన్న కృష్ణ చిన్నప్పుడే నాకు వయసులో మా అమ్మకి ఒక మాట ఇచ్చాను అది డాక్టర్ అయ్యి పేదలకు ఉచితంగా సేవ చేయడం మా నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం స్కూల్లో ప్రతి సంవత్సరం నేను ఫస్ట్ వచ్చేదాన్ని ఇప్పుడు అలాగే మీకు మాట ఇస్తున్నాను బాబాయ్ ఉంటుందా జీవితం సంతోషంగా ఉండేలాగా చేస్తాను అని చెబుతుంది. ఆ మాటకు ఆయన సంతోషిస్తాడు.

వస్తే ఇప్పుడే నేను ఇంటికి వెళ్లి వచ్చాను అని అంటుంది మీ జీవితం సంతోషంగా ఉంటుంది అని బాబాయ్తో చెప్పి వచ్చాను అని అంటుంది కృష్ణ చెప్పిన మాటలు ముకుందా అసలు ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది. ఏ ముకుంద మీ నాన్న దగ్గరికి వెళ్లాలని నీకు భయంగా ఉందా అని అడుగుతుంది. ఎందుకు భయం అలాంటిది ఏమీ లేదు అని చెబుతోంది.

ఇక రేపటి ఎపిసోడ్లో భవానికి కాఫీ ఇవ్వడానికి ముకుందా వెళ్తుంది ఏంటి ముకుందా ఏదో చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని భవాని అడుగుతుంది నేను ఆదర్శ వచ్చినా కూడా సంతోషంగా ఉండాలేను. తను వస్తాడని నేను అనుకోవడం లేదు. వచ్చిన నేను హ్యాపీ గా ఉండలేను అని అంటున్న మాటలకు కృష్ణ ఎక్కడ ముకుంద నిజం చెబుతుందా అని కంగారు పడుతుంది.