NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Gaddar | గద్దర్ మహా ప్రస్థానం: కళా రవి…ప్రజా కవి…అందుకో మా అశ్రునివాళి! గద్దర్ సినిమాలు, గద్దర్ పాటలు, గద్దర్ విప్లవం!!

Gaddar Revolutionary Poet and Peoples Balladeer Life Gaddar Songs Gaddar Movies Gaddar Mahaprasthanam

Gaddar | గద్దర్ మహా ప్రస్థానం: ప్రజా కవి, విప్లవ యోధుడు గద్దర్ పేరు వింటే తెలుగు వారి గుండెలు ఉప్పొంగుతాయి. నరాలు పొంగు తాయి. ఆయన పాట ఒక చై తన్యం ఆయన పాట ఒక విప్లవం. రోమాలు నిక్కపొడుచుకునే సాహిత్యాన్ని తెలుగు వారికి అందించి గద్దర్ అనే ఓ ప్రకాశవంతమైన సూర్యుడు పొడుస్తున్న పొద్దు మీద తన నడకను చాలించాడు. మరెందరో కవులకు తెలంగాణా గడ్డ పై మార్గ దర్శకుడయ్యాడు. సమ సమాజ స్థాపన కోసం ఆయుధాలు పట్టినా, ప్రజా ఉద్యమంలో కలం పట్టి గళం విప్పినా ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరు బాట పట్టారు. తన పాటలతో ప్రజలను చైతన్యం చేసి పోరు తెలంగాణలో ఎందరో సైనికులను తయారు చేశారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా , బండెనక బండిగట్టి లాంటి ఎన్నో పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాయి. ఆ నిప్పు ఆరిపోకుండా కాపును కాసాయి.

Gaddar Revolutionary Poet and Peoples Balladeer Life Gaddar Songs Gaddar Movies Gaddar Mahaprasthanam
Gaddar Revolutionary Poet and Peoples Balladeer Life Gaddar Songs Gaddar Movies Gaddar Mahaprasthanam

శరీరంలో బుల్లెట్ ఉన్నా ఏనాడూ ప్రజాఉద్యమంలో వెనకడుగు వేయలేదు గద్దర్. ఆయన పాట పాడితే వేలాది గుండెలు చైతన్యవంతమవుతాయి. నేను సైతం అంటూ ప్రజాయుద్ధక్షేత్రంలోకి వచ్చిన ఆయనను ‘ప్రజాయుద్ధనౌక’ అని ప్రేమగా పిలుస్తారు. ఆయన ఒక గాయకుడు, రచయిత. ప్రజల వేదనలను పాటలుగా మార్చి గళం విప్పేవా రు. ఆయన పాటలు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాయి. పాలకుల దోపిడీని ప్రశ్నించాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు పీడిత ప్రజల వేదనను కళ్లకు కట్టాయి. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన వెన్నులో బుల్లెట్‌ ఇరుక్కుపోయింది. ఈ బుల్లెట్ ను తన శరీరంలో ఉన్నా ఆయన వెనుకంజ వేయలేదు. తుదిశ్వాస వరకు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలపై పోరు సాగించారు. తెలంగాణ ఆవిర్భావంతో గద్దర్ తన మార్గాన్ని మార్చుకున్నారు. విప్లవ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన గద్దర్… ప్రజాస్వామ్య పంథాలోకి అడుగుపెట్టారు.

Gaddar Revolutionary Poet and Peoples Balladeer Life Gaddar Songs Gaddar Movies Gaddar Mahaprasthanam
Gaddar Revolutionary Poet and Peoples Balladeer Life Gaddar Songs Gaddar Movies Gaddar Mahaprasthanam

1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా గద్దర్ పోరాడారు. జన నాట్య మండలిలో చేరి…. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథలతో గ్రామీణ ప్రజల్లో చైతన్యం కలిగించారు. గద్దర్ పాడే పాటల్లో దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలు కళ్లకు కట్టినట్టుగా ఉంటాయి. పాటలు, నాటకాల రూపంలో ప్రజా సమస్యలపై పోరుసాగించారు.

Breaking: ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో వేలాది గుండెలను చైతన్యంచేశారు తూటాల్లాంటి పాటలు రచించారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ…. తెలంగాణ ఉద్యమ గీతం గా నిలిచాడు. మీ పాటనై వస్తున్నాను అంటూ పేద వాడి గొంతుగా మారాడు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ గద్దరు పాలకులను ప్రశ్నించాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించి నిల దీసాడు. తొలి నాళ్లలో”ఆపర రిక్షా” అంటూ పాటను రాసిన గద్దర్…. 1972లో జన నాట్య మండలిలో చురుకుగా పని చేస్తూ వచ్చాడు. నాడు గ్రామాలలో జరుగుతున్న అక్రమాలను ఎదురించటంలో ముందు నిలిచాడు. నక్సలైట్ ఉద్యమంలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన…ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి కూడా తన పాట ను ఆపలేదు. ఆయన పాట అంటే తెలియని వారు ఉండరు . ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాధనలో కూడా ప్రజాఫంట్ ఏర్పాటు చేసి… ప్రత్యేక తెలంగాణను కోరుకున్నాడు. ఆయన రాసిన పాటలు , జై బోలో తెలంగాణ (2011) భద్రం కొడుకో రంగులకల (1983) బండెనక బండి గట్టి మా భూమి (1979) అడవి తల్లికి వందనం, దండకారణ్యం (2016) మల్లె తీగకు పందిరి వోలె  ఒరేయ్ రిక్షా (1995) లాంటివి అద్భుతమైన సాహిత్యం గ కొనియాడ బడినవి. గద్దర్ గారికి ఉత్తమ గేయ రచయితా గ 2011 లో నంది అవార్డు వచ్చింది. కానీ ఆయన ఆ అవార్డు ని తిరస్కరించారు. మళ్ళీ ఆయనకు ఉత్తమ గాయకుని అవార్డు ఇవచ్చింది జై బోలో తెలంగాణ అనే సినిమా

.ఆయన రాసిన ముద్రితం కానీ రచనలను ప్రభుత్వం ముద్రిచితే భావి తరాలకు మంచి సాహిత్యం భద్రపరచినట్లవుతుంది. అదే ఒక ఘన నివాళి.

 

 

 

Related posts

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju