NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు

Breaking:  ప్రజా యుద్దనౌక గద్దర్ ఇక లేరు. గద్దర్ ఇవేళ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండె పోటుతో కొద్ది రోజుల క్రితం అమీర్ పేట లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరిన గద్దర్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహరా పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఈ నెల మూడవ తేదీన గద్దర్ కు బైపాస్ సర్జరీ జరగ్గా కోలుకుంటున్నట్లుగా కనిపించారు.

అయితే ఊరిపితిత్తులు, యురినరీ సమస్యలతో గద్దర్ బాధపడుతుండటంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, కొద్ది సేపటికే కన్నుమూశారు. గద్దర్ మరణంతో సికింద్రాబాద్ భూదేవి నగర్ లోని ఆయన నివాసం వద్దకు బంధువులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. గద్దర్ మృతితో భూదేవి నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజా యుద్దనౌక గా పేరు పొందిన గద్దర్ .. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు. గద్దర్ మృతికి వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలియజేస్తున్నారు.

గద్దర్ తూప్రాన్ లో 1949 లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్. నిజామాబాద్, హైదరాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆయన 1975 లో కెనరా బ్యాంక్ లో ఉద్యోగం చేరారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల ఉన్నారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. మరీ ముఖ్యంగా 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

భావ వ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. దీని కొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శన ను చూసిన సినిమా దర్శకుడు బి నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట అపర రిక్షా రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. ‘అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపు తెచ్చాయి. మా భూమి సినిమాలో వెండి తెరపై కనిపించిన గద్దర్ పాడిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా’ పాటకు నంది అవార్డు లభించింది. అయితే ఆ అవార్డును ఆయన తిరస్కరించారు.

పుంగనూరు ఘటనలో ఏ 1 గా చంద్రబాబు

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju