NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాకు సర్కార్ బిగ్ షాక్ .. ఎస్మా చట్టం కింద చర్యలు అంటూ హెచ్చరిక

విద్యుత్ సంస్థల యాజమాన్యంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు, మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జేఏసీ, ఈ నెల 8న విజయవాడలోని విద్యుత్ సౌధ ఎదుట మహా ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మహా ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) కాంతిరాణా టాటా స్పందించారు.

 

విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మహా ధర్నాకు పోలీస్ అధికారుల వద్ద నుండి లేదా ప్రభుత్వం నుండి ఏ విధమైన అనుమతులు లేవని ఆయన తెలిపారు. విజయవాడ నగరంలో సెక్షన్ 144 సిఆర్.పి.సి. మరియు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని తెలిపారు. నిషేదాజ్ఞల కారణంగా ధర్నా కార్యక్రమమునకు అనుమతులు నిరాకరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ESMA (ఎస్మా) ఎస్సేన్సియల్  సర్వీసెస్ మెయిన్టినేన్స్ యాక్ట్ అమలులో వున్నదని తెలిపారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎస్సేన్సియల్  సర్వీసెస్ కావున ఎస్మా చట్టం అమలులో వుంటుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి.నెంబరు 54  ద్వారా అన్ని ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ల యందు ఎస్మా చట్టాన్ని ఉదహరిస్తూ సదరు ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ నందు ఉన్న మూడు ట్రాన్స్మిషన్ కంపెనీలు అనగా APEPDCL, APSPDCL & APCPDCL, మరియు AP GENCO లలో పనిచేయు వారు ఎటువంటి సమ్మెలను చేయకుండా తేది.10.05.2023 నుండి ఆరు నెలలపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని తెలిపారు. కావున ఎవరైనా ఈ ధర్నాలో పాల్గొంటే వారిపై ఎస్మా చట్టం క్రింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా ఎవరైతే నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తారో వారిపై ఐపీసీ ప్రకారం సెక్షన్ 143, 427, 452, 283, 341, 506, 120(B), R/W 149 క్రింద మరియు పి.డి.పి.పి.చట్టం (Prevention of Damage to Public Property Act) సెక్షన్ 3 క్రింద కఠిన చర్యలు మరియు ఆంద్రప్రదేశ్ కండక్ట్ రూల్స్ ప్రకారం శాఖా పరమైన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

తమకు తెలిసిన సమాచారం ప్రకారం కొంత మంది బయటి వ్యక్తులు ఈ ధర్నా కార్యక్రమములో చేరి హింసకు పాల్పడే అవకాశం కలదన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయని చెప్పారు.  నగరంలో రెండు వేల మంది పోలీస్ సిబ్బంది, సి.సి.కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, వీడియో గ్రఫి మొదలగు వాటి ద్వారా పటిష్టమైన నిఘా పెట్టి, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి విజయవాడ వైపు వచ్చు వాహనాలు అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని సీపీ తెలిపారు.

Breaking: ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju