NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. షెడ్యుల్ ఇలా..

YS Jagan: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వ్యవసాయ పంటలు ముంపునకు గురి అయ్యాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అధికారులు అందించిన సహాయ చర్యలు, వరద సాయం అందిందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకోనున్నారు. రెండు రోజుల సీఎం జగన్ పర్యటన షెడ్యుల్ వివరాలు ఈ విధంగా..

CM YS Jagan

 

రేపు 7వ తేదీ (సోమవారం) ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్‌ జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. అక్కడ గోదావరి వరదల ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన అనంతరం కూనవరం బస్‌స్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ పరిశీలన అనంతరం వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ ఆర్‌ అండ్‌ బీ అతిధి గృహంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఎల్లుండి (మంగళవారం) ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ నుంచి బయలుదేరి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత తానేలంక రామాలయంపేట గ్రామం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఏపీ విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాకు సర్కార్ బిగ్ షాక్ .. ఎస్మా చట్టం కింద చర్యలు అంటూ హెచ్చరిక

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju