NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

Allu Arjun: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ భారీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు తనదైన ప్రతిభతో హీరోగా నిలదొక్కుకున్నాడు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. అటువంటి అల్లు అర్జున్ గత 20 సంవత్సరాల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు ఒక రూల్ ను స్ట్రెక్ట్ గా పాటిస్తాడట. అదేంటంటే షూటింగ్ ఉన్న ముందు రోజు తప్పనిసరిగా 9 లేదా 10 గంటలకు అల్లు అర్జున్ పడుకుంటాడట. షూటింగ్ ముందు రోజు ఎటువంటి పార్టీలకు వెళ్లడట.

రెండు ద‌శాబ్దాల నుంచి ఈ రోల్ ను అల్లు అర్జున్ పాటిస్తున్నాడట. తాజాగా ఆర్య‌ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో ఆయ‌న‌ ఈ విషయాన్ని బయట పెట్టాడు. అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఆర్య. సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన క్లాసిక్‌ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో అనురాధ మెహతా హీరోయిన్ గా నటించింది. 2004 మే 7న విడుదలైన ఆర్య సినిమా అప్పట్లో భారీ విషయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ ను డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టింది. ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. అయితే ఆర్య మూవీ విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న‌ సందర్భంగా హైదరాబాద్లో ఓ స్పెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌ అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాత దిల్ రాజుతో పాటు ఆర్య మూవీ కోసం పని చేసిన వారంతా హాజరు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. `ఆర్య ఫ‌స్ట్ షో పూర్తయిన తర్వాత ఇది 10 వారాల మూవీ అని చాలా మంది అన్నారు. దాంతో నేను చాలా నిరాశ చెందాను. ఎందుకంటే అప్ప‌ట్లో 10 వారాలు నడిస్తే సినిమా యావరేజ్ అనేవాళ్లు. అయితే ఆర్య 125 రోజులు ఆడింది. ఓ గేమ్ ఛేంజర్ మూవీగా నిలిచింది` అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే `ఆర్య షూటింగ్ టైంలో న్యూ ఇయర్ వచ్చింది. దాంతో నైట్ మొత్తం పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశాను. పొద్దున్నే షూటింగ్ ఉందని కాల్ వచ్చింది. తకదిమిథోమ్ సాంగ్ ను చిత్రీక‌రించాలి వెంట‌నే ర‌మ్మ‌న్నారు. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో షూటింగ్ కి వెళ్తే ఓప‌క్క నిద్ర లేదు, మ‌రో ప‌క్క ఎండ వ‌ల్ల‌ చాలా కష్టపడ్డాను. షూటింగ్ ఉన్న ముందు రోజు పార్టీల‌కు దూరంగా ఉండాల‌ని ఆ రోజే డిసైడ్ అయ్యా. 8 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేయ‌డం చాలా క‌ష్టం. అందుకే షూటింగ్ ఉంటే ముందు రోజు 9 లేదా 10 గంట‌ల‌కి ప‌డుకుంటా. ఆర్య సినిమా స‌మ‌యం నుంచి ఇవాళ్టి వరకు కూడా ఆ రూల్ ను ఫాలో అవుతున్నా.. కాబట్టే ఇవాళ ఇలా ఉన్నాను` అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. దీంతో ఆయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప 2 ది రూల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ఆగ‌స్టులో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju