NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

Megha Akash: 2024 ఆరంభం నుంచి సినీ పరిశ్రమలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు తమ సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెప్పి మింగిల్ అయిపోతున్నారు. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను, అపర్ణ దాస్ వంటి తారలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి సిద్ధం అవుతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు మేఘా ఆకాష్. తమిళ్ తెలుగు సినీ ప్రియులకు మేఘా ఆకాష్ అత్యంత సుప్రసిద్ధురాలు. చెన్నైలో ఈ ముద్దుగుమ్మ జ‌న్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రకటన రంగంలో వ‌ర్క్ చేస్తున్నారు.

స్ట‌డీస్ కంప్లీట్ అయ్యాక యాక్టింగ్ పై ఉన్న మ‌క్కువ‌తో మేఘా ఆకాష్ గ్లామ‌ర్ ప్ర‌పంచం వైపు అడుగులు వేసింది. తెలుగు భాషా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లై మూవీతో వెండితెర‌పై హీరోయిన్ గా అడుగు పెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా మేఘా ఆకాష్‌ నటించింది 2017 లో విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే యాక్టింగ్ పరంగా మరియు గ్లామర్ పరంగా మేఘా ఆకాష్‌ విమర్శకుల నుంచి ప్రశంసాలు అందుకుంది. ఆ తర్వాత మళ్లీ నితిన్ తో క‌లిసి చల్ మోహన్ రంగా సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.

అయితే ఈ ప‌రాజ‌యాల‌ను ఆమెకు వ‌చ్చే అవ‌కాశాల‌ను ఏ మాత్రం అడ్డుకోలేక‌పోయాయి. 2019లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యొక్క‌ పెట్టా మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్‌.. అటుపై తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస చిత్రాల్లో న‌టించింది. స్టార్ హోదాను అందుకోలేక‌పోయినా న‌టిగా త‌న‌కంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. చివ‌రిగా తెలుగులో మను చరిత్ర, త‌మిళంలో వడక్కుపట్టి రామసామి చిత్రంలో క‌నిపించింది. ప్ర‌స్తుతం మజ్హై పిడికథ మనితన్ అనే త‌మిళ సినిమాతో పాటు తెలుగులో ఓ రెండు సినిమాల‌కు సైన్ చేసింది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మేఘా ఆకాష్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట జోరుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ విధంగా ప్ర‌చారం జ‌ర‌గ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. తాజాగా మేఘా ఆకాష్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేతికి మెహందీ పెట్టుకుని ట్రెడీష‌న‌ల్ లుక్ లో దిగిన కొన్ని ఫోటోల‌ను పంచుకుంది. ఈ ఫోటోల‌కు వెడ్డింగ్ వైబ్స్ అంటూ హ్యాచ్ ట్యాగ్ కూడా పెట్టింది. దీంతో మేఘా ఆకాష్ మ్యారేజ్ హాట్ టాపిక్ అయింది. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌తో మేహా ఆకాష్ పెళ్లి సెట్ అయింద‌ని.. త్వ‌ర‌లోనే ఆమె త‌న సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేయబోతోంద‌ని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న పెళ్లి విష‌యంపై ఫోటోల ద్వారా మేఘా ఆకాష్ హింట్ ఇచ్చిందంటూ చర్చించుకుంటున్నారు. మ‌రి నిజంగానే ఈ అందాల భామ త్వ‌ర‌లో ఓ ఇంటిది కాబోతోందా..? లేదా.. ? అన్న‌ది తెలియాలంటే మేఘా ఆకాష్ లేదా ఆమె స‌న్నిహితులు స్పందించాల్సిందే.

Related posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri