NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

ఈ రాఖీ పండుగ రోజున ఇవన్నీ చేస్తున్నారా లేదా…? దాని విశిష్టత తెలుస్కోండి మరి

ఈ రోజున భారత దేశం మొత్తం ఎంతో అపురూపంగా.. ఆప్యాయంగా జరుపుకునే ఈ రక్షాబంధన్ పండుగను కొన్నిచోట్ల శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా జరుపుకునే ఈ పండుగను కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో చాలా వైభవంగా జరుపుకునేవారు

India gears up to celebrate the Rakhi bondఅయితే ఇప్పుడు ఈ ఆచారం దేశమంతా పాకింది. అన్నకు గాని గానీ లేదా తమ్ముడికి గాని ప్రేమ సూచికంగా సోదరి కట్టే ఒక పట్టీని రాఖీ అని పిలవడం విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం అని అర్థం. ఇది అన్నా చెల్లెలు…. అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ.

ఎలా అయినా జరుపుకోవచ్చు

దేశవ్యాప్తంగా ఎంతో విశిష్టత కలిగిన ఈ రాఖీ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్య కాకుండా ఏ బంధుత్వం లేకపోయినా ఆప్యాయంగా మరియు తోడుగా వెన్నంటే ఉండే ఒక సోదరుడుకిసోదరి మంచి భావనలతో…. ఎవరికైనా ఈ రాఖీని కట్టడం జరుగుతుంది. ఇది కేవలం సోదరి సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి చిహ్నంగా కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు.రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అంటూ ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండగ యొక్క విశిష్టతను చాలా గొప్పాది.

Raksha Bandhan/Rakhi Date 2020 & Significance of the Rakhi ...అసలు రేపు ఏం చేయాలంటే…. : ఇక పోతే రాఖీ రోజు తెల్లవారు జామునే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాఖీకి సిద్ధపడతారు సోదరులు. అక్కచెల్లెళ్ళు అంతా అన్నదమ్ముల కి రాఖీ కడతారు రాఖీ కట్టేటప్పుడు కొన్నిచోట్లయేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచలఅనే స్తోత్రాన్ని కూడా చ‌దువుతారు.ఎలాగైతే ఆ విష్ణుమూర్తి బలిచక్రవర్తిని బంధించాడో.. నువ్వు కూడా ఇతన్ని ఏ కాలాల్లోనూ విడువకుండా ఉండు అని దాని అర్థం. ఆ తరువాత హారతినిచ్చి నుదుట తిలకం దిద్దుతారు. దానికి సంతోషపడి సోదరులు తమ ప్రేమకు గుర్తుగా రాఖీని కట్టిన వారికి చక్కటి బహుమతులు అందిస్తారు.

Raksha Bandhan 2020 - All about Raksha Bandhan, History ...

స్త్రీ రక్షణే మగాడికి శ్రీ రామ రక్ష

ఇక అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారంతో కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆరోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి కుడిచేతికి రక్షణ తాడుని కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారి పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈ రోజు రాఖీ గా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

Raksha Bandhan 2020 Rakhi Festival In India How To Make Rakhi At ...

ఇది అన్నా చెల్లెళ్ళ ఇతిహాస కథ

అంతేకాకుండా ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెలు అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్షణా ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగుని అతని వేలుకి చుడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండగ ఆవిర్భవించింది అని మరి కొందరు చెబుతుంటారు.

Raksha Bandhan 2017: What is the festival about and why do sisters ...

ఆచారాలూ పాటించాలిగా

ఇక ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమి లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారు ఈ రోజునే పాతది వదిలి తిరిగి కొత్త దానిని ధరిస్తారు. దీన్నే ఉపాకర్మ అని కూడా అంటారు. ఉపాకర్మ ను యజ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు. దీనికియాగ కర్మ తో పునీతమైన దారంఅని అర్థం పాల్కురికి సోమనాథుడు దీనిని పౌర్ణమి అని అన్నాడు…. ఎందుకంటే నూలుతో తయారు చేసిన ఈ జంధ్యాన్ని ధరించి దీనికి కారణం వేధ అధ్యయనానికి ప్రత్యేకమైన ఉపాకర్మ ను ఆచరించాలి. దానికంటే ముందుగా ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం. ఇలా అనేక కథల నుండి రూపాంతరం చెంది.. ప్రతీ చోటా మంచిని పునికి పుచ్చుకొని చివరికి ఇలా ఈ రోజు మన జీవితాల్లో సుఖసంతోషాలను, ధైర్యాన్ని నూరి పోసేందుకు బయలుదేరింది ఈ రాఖీ పండుగ.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!