NewsOrbit
Featured దైవం న్యూస్

Daily Horoscope ఆగష్టు 3rd సోమవారం మీ రాశి ఫలాలు

Daily horoscope in telugu

మేష రాశి : ఈరోజు పెండింగ్‌ పనులు పూర్తిచేయండి !

మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొండి. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్ధికసమస్యలు పెరుగుతాయి. కుటుంబ వేడుకలు, క్రొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి. కానీ ఎంపికలో భద్రంగా ఉండండి. వ్యాపారభాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితో కలిసి నిలిచి పోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పనిచెయ్యండిఈ రోజు మీ జీవిత భాగస్వామి తో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు.రెమిడీ: మంచి ఆర్థిక జీవితం కోసం శ్రీలక్ష్మీనారాయణుల  ఆరాధన చేయండి.

Daily horoscope in telugu
Daily horoscope in telugu

వృషభ రాశి : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు మీరు ఇదివరకుటికంటే ఆర్ధికంగా బాగుంటారు. మీదగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.రెమిడీ: మంచి ఆలోచనలు, ప్రశాంతత కోసం శ్రీవేంకటేశ్వరస్వామి గద్యం వినండి. లేదా చదవండి.

మిథున రాశి : ఈరోజు శుభవార్త వింటారు !

దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్ధికనష్టాలు తప్పవు. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు. ఆనందకరమైన రోజు ఈ రోజు.రెమిడీ: కుటుంబ జీవితాన్ని మెరుగుపరచటానికి ఇంట్లో మీ ఇష్టదేవతరాధన చేయండి.

కర్కాటక రాశి : ఈరోజు పోస్ట్‌ద్వారా అందిన వార్త సంతోషాన్నిస్తుంది !

మంచి ఆహారం, చక్కని ఆనందకరమైన క్షణాల వంటివన్నీ ఈ రోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి.త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీరు చేసిన పనులకు, మరెవరో పేరుగొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఈరోజు ఆఫీసునుండి వచ్చిన తరువాత మీరు మీ ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు.రెమిడీ: మీ కెరీర్లో అద్భుతమైన వృద్ధి పొందడానికి, మీ ప్రవేశ ద్వారం రెండు నిమ్మకాయలను రెండువైపులా పెట్టండి.

సింహ రాశి : ఈరోజు అనారోగ్యం నుంచి విముక్తి !

ప్రయోజనకరమైన రోజు.దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. ఈరాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది,లేనిచో మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది.రెమిడీ: మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం ‘ఓం’ మంత్రాన్ని కనీసం 108 సార్లు ధ్యానం చేయండి.

కన్యా రాశి : ఈరోజు వ్యాపారంలో లాభాలు !

మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించివేస్తుంది. సానుకూల దృక్పథం, వెలుగువైపునకు చూడడం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచగలవు. ఈరోజు వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఈ రోజు మీరు హాజరుకాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.రెమిడీ: గొప్ప ఆరోగ్యం కోసం శివాభిషేకం చేయించండి లేదా చేసుకోండి.

తులా రాశి : ఈరోజు మీ దగ్గరివారి నుంచి సహాయం అందుతుంది !

ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. వ్యాపారాభివృద్ధి కొరకు మీరుకొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గరివారి నుండి మీకు ఆర్ధిక సహాయము అందుతుంది. మీ చుట్టుప్రక్కల ముఖ్యమైన నిర్ణయాలు చేసే వారికి మీ అభిప్రాయాలు చేరవేస్తే, లబ్దిని పొందుతారు. మీ అంకితభావానికి, నిజాయితీకి మెప్పు పొందుతారు. రెమిడీ: ఆరోగ్యకరమైన జీవితం కోసం శ్రీవేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి : ఈరోజు తల్లిదండ్రుల సహకారంతో ఆర్థిక సమస్యల పరిష్కారం !

చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. స్నేహితులు, మీ జీవిత భాగస్వామిని, మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. మీ గత పరియస్థులలో ఒకవ్యక్తి, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. దానిని గుర్తుండిపోయేలాగ చేసుకొండి. ఈరాశికి చెందినవారు పొగాకుకు, మత్తుపానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. రెమిడీ: మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం పంచామృతాలతో శివారాధన చేయండి.

ధనుస్సు రాశి : ఈరోజు లావాదేవీలు జాగ్రత్తగా చేయండి !

ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు ధననష్టం సంభవించవచ్చు. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. పనిచేసే చోట, ఇంటిలోను వత్తిడి మిమ్మల్ని కోపిష్ఠి వారిగా చేయవచ్చును. మీకొరకు మీరు బయటకువె ళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది.రెమిడీ: వృత్తి లో లాభాలు పొందడానికి  పేదవారికి బియ్యం, పప్పు దానం చేయండి.

మకర రాశి : ఈరోజు ఎదురుచూడని లాభాలు వస్తాయి !

ఇది మరొక అతిశక్తివంతమైన రోజు, ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది. భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.రెమిడీ: కుంటుం జీవితానికి ఆనందంగా ఉంచుకోవడానికి కుక్కలకు ఆహారం పెట్టండి.

కుంభ రాశి : ఈరోజు ఉమ్మడి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టకండి !

యోగా, ధాన్యం వంటి వాటితో కాలం గడపడం మంచి ఫలితాన్నిస్తుంది.ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు.- మరింకా మీరుకూడా సంతోషంగా ఒప్పుకుంటారు. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చును. ఈ రోజు మీ పనులు చాలావరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. రెమిడీ: ఇష్టదేవతరాధన, శ్రీ లక్ష్మీదేవి దగ్గర దీపారాధన ఆరోగ్యకరమైన జీవితాన్నిస్తుంది.

మీన రాశి : ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చే పనిలో లీనమవండి. అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మలని నిరాశకు గురిచేసి, అందుబాటులో లేకుండా పోవచ్చు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. రెమిడీ:  రోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి పెద్దల నుంచి దీవెనలు పొందండి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N