NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ పై కేసీఆర్ గుర్రు.. సుప్రీంలో కేసు షురూ..

kcr angry over jagan decision

కేసీఆర్ కు జగన్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఇందుకు వీరిద్దరికీ కామన్ శత్రువైన చంద్రబాబు నాయుడు కూడా ఒక కారణం. ఈ శత్రువును జయించడానికి 2109 ఎన్నికల ముందు చిగిరుంచిన స్నేహం ఎన్నికల ముందు మొగ్గలు తొడుక్కుని ఫలితాల తర్వాత పూవులుగా విరబూసింది. ప్రస్తుతం ఈ పూవుల రేకలు ఒక్కోటిగా రాలిపోతున్నట్టుగా ఉంది. పైకి స్నేహంగా ఉన్నామని అంటూనే కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు) విషయంలో ఒకరిపై మరొకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

kcr angry over jagan decision
kcr angry over jagan decision

సుప్రీంకు తాజా పిటిషన్ లో ఏముందంటే..

రాయలసీమ ఎత్తిపోతలపై పథకంపై ఏపీ ముందుకు పోకుండా.. టెండర్ ప్రక్రియ చేపట్టకుండా చూడాలని కోరుతూ తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిజానికి కేసీఆర్ ఈరోజు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో ఏపీ సీఎంతో కలిసి సమావేశం కావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించాల్సి ఉంది. కానీ.. కేసీఆర్ ఇందుకు విముఖత చూపించారు. అపెక్స్ కౌన్సిల్ లో తేల్చుకోవాల్సిన అంశాన్ని ఒక్కసారిగా కేసీఆర్ సుప్రీంకు వెళ్లడం చర్చనీయాంశమైంది. దీని వెనుక కేసీఆర్ వ్యూహం ఏమై ఉంటుందో అనే ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఏపీ ప్రభుత్వ వైఖరి ఏంటి..

రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఏడాదికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు. రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని అధికారులతో సీఎం అంటున్నారు. దీనిని ఆపేదిలేదని కూడా అధికారులు అంటున్నారు. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏపీ ఎలా కౌంటర్ దాఖలు చేస్తుందో అనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ ఎలా తిప్పికొడుతుంది.. నీటి లెక్కలను ఎలా చూపిస్తుంది.. తమ వాటాలోని 512 టీఎంసీల నీటిని వాడుకునే లెక్కల్ని ఎలా చెప్పుకొస్తుందో కీలకంగా మారింది. లేదా.. కీసీఆర్ తోనే మరోసారి భేటి అయ్యి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది.

 

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?