NewsOrbit
రాజ‌కీయాలు

కోర్టుల బ్యాక్ టూ బ్యాక్ దెబ్బల నొప్పికి – జగన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆయింట్మెంట్ ! 

మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న సం‌గ‌తి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్

ఆమోదం తెలపడంతో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్డు స్టే విధించింది. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకొని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. అయితే, అక్క‌డా త‌క్ష‌ణ‌మే తీర్పు వెలువ‌డే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డంతో, ఏపీ స‌ర్కారు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిష‌న్‌ విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. త‌ద్వారా సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధ‌మైంది. అయితే పిటిష‌న్‌లో వివ‌రాలు స‌మ‌గ్రంగా లేవంటూ త‌క్ష‌ణ‌మే విచార‌ణ‌కు సుప్రీంకోర్టు స్వీక‌రించ‌న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు, రాజ‌ధాని శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని సీఎం జ‌గ‌న్ ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. శంకుస్థాప కార్య క్రమానికి ప్రత్యక్షంగా, ఒక‌వేళ వీలు కాక‌పోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనవలసిందిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆహ్వనించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మోడీ ప్ర‌య‌త్నించిన్న‌ట్లు స‌మాచారం. అయితే, ఓ వైపు హైకోర్టులో తీర్పు 14వ తేదీన వెలువ‌డటంపై అస్ప‌ష్ట‌త‌, మ‌రోవైపు సుప్రీంకోర్టులోనూ సానుకూల ప‌రిణామాలు క‌నిపించ‌క‌పోవ‌డం, స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ప్ర‌ధాని మోదీ షెడ్యూల్ ఖ‌రారు అయ్యే వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో ఆగ‌స్టు ప‌దహారున శంకుస్థాప‌న‌ను వాయిదా వేసుకుంది ఏపీ ప్ర‌భుత్వం.

కాగా, ఏపీ స‌ర్కారు తాజాగా నిర్ణ‌యించిన ముహుర్తం ద‌స‌రా. అక్టోబ‌ర్ 25వ తేదీ. ఈ నిర్ణ‌యం వెనుక ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్న‌ట్లు స‌మాచారం. ఒక‌టి దాదాపు రెండు నెల‌ల వ్య‌వ‌ధి ఉన్నందున అప్ప‌టి వ‌ర‌కు మూడు రాజ‌ధానుల‌పై ఉన్న వివాదాలు, స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌నే న‌మ్మ‌కం. మ‌రొక‌టి, అమరావతి రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాప‌న చేసింది అక్టోబర్ 21న విజయదశమి. 2015లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం యొక్క ప్రాధాన్య‌త‌ను గుర్తు చేసేలా 2020 అక్టోబ‌ర్ 20న శంకుస్థాప‌న పెట్టుకుంటున్న‌ట్లు స‌మాచారం.

అయితే, ఈ శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ హాజ‌ర‌వుతారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో ఏపీలో బీజేపీ సపోర్ట్ తోనే మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతం చేశారని ప‌లు పార్టీలు ఆరోపించాయి. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ధాని హాజ‌రు కానున్నార‌‌నే అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఒక‌వేళ‌, ప్ర‌త్య‌క్షంగానో లేదా ఆన్‌లైన్ రూపంలో మోదీజీ ఈ కార్య‌క్ర‌మంలో భాగం పంచుకుంటే మాత్రం అది ఏపీ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?