NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ.. జగన్ స్పందిస్తారా? లేఖలో ఏముంది?

somu veerraju open letter to cm ys jagan

ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఏపీ ప్రజలు బాగానే మెచ్చుకుంటున్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా కూడా ఆయన సరికొత్త సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. గతంలో పాలించిన టీడీపీ సరైన పథకాలను ప్రారంభించి.. ప్రజల్లోకి చేరువకాలేకపోయింది. కానీ.. జగన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.

somu veerraju open letter to cm ys jagan
somu veerraju open letter to cm ys jagan

అందుకే ప్రస్తుతం ఏపీ ఏరంగంలోనైనా ముందంజలో ఉంది. దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాల కన్నా.. ఏపీ మెరుగ్గా ఉంది. కాకపోతే అప్పు మాత్రం కాస్త ఎక్కువగా ఉంది.

మరోవైపు ఏపీలో బీజేపీ కూడా తన కార్యచరణను పెంచుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు అయ్యాక ఏపీ బీజేపీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే కాదు.. వీర్రాజు కూడా కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఏపీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు.

తాజాగా సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. తాజాగా నరసింహ స్వామి ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన గురించి సోము లేఖలో ప్రస్తావించారు.

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటేనే ఎంతో పేరుగాంచింది. ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న రథం అగ్నికి ఆహుతి కావడంపై సోము వీర్రాజు.. జగన్ కు లేఖ రాశారు.

రథం అగ్నికి ఆహుతి కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏటా అంగరంగ వైభంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. కళ్యాణోత్సవాల సమయంలో స్వామి వారి రథోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు చాలా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. 1958లో ఈ రథాన్ని తయారు చేశారు. అప్పటి నుంచి ఈ రథాన్నే రథోత్సవాలకు ఉపయోగిస్తున్నారు.

కానీ.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టండి. అయితే.. ఈ అగ్ని ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అగ్ని ప్రమాదం వల్ల దగ్ధం అయిందా? లేక ఎవరైనా కావాలని చేశారా? అనేది తెలియాలి. నిందితులు ఎవరైనా వాళ్లను కఠినంగా శిక్షించాలి.. అంటూ సోము.. లేఖలో పేర్కొన్నారు.

అయితే.. సోము వీర్రాజు.. ఏకంగా సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మరి.. సీఎం జగన్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N