NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

నోటిదురుసును ప్ర‌ద‌ర్శించిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన జో బైడెన్!

ఒక వ్య‌క్తి గురించి మాట్లాడుతుంటేనే ఎంతో జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి క‌దా..? అలాంటిది ఒక దేశం గురుంచి మాట్లాడుతుంటే ఇంకేంత జాగ్ర‌త ప‌డాలి..? ఆ మాటాలు ఏదో ఒక సాధార‌ణ వ్య‌క్తి మాట్లాడితే ప‌ట్టించుకోమేమో కానీ.. ఒక దేశ అధ్య‌క్షుడు మాట్లాడితే..? ఆయ‌న‌ను ఏమ‌నాలి అంటూ ప‌లువురు విశ్లేష‌కులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ మాట‌లు అంది ఎవ‌రో కాదు.. మ‌న మిత్ర దేశమైన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్. ఈయ‌న‌కు నోటి దురుసు ఎక్కువే కానీ మ‌రీ ఇంత‌లా ఉంటే క‌ష్టం అని ప‌లువురు మండిప‌డుతున్నారు. రోజుకో ర‌కంగా ఆయ‌న మీద‌ విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. మ‌ళ్లీ ఇలా మాట్లాడ‌టం ఏంట‌ని, ఇలా మాట్లాడితే రాబోయే ఎన్నిక‌ల్లో మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

న‌వంబ‌ర్ లో జ‌రిగే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భాగంగా నిర్వ‌హించిన చివ‌రి ప్రెసిడెన్సియ‌ల్ డిబెట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఇండియాను మురికిదేశమని అన్నారు. ఇండియా‌లో గాలి నాణ్యత చాలా మురికిగా ఉందని ఆరోపించారు. భారత్, రష్యా, చైనా దేశాల్లో గాలి నాణ్యత ఎంత మురికిగా ఉందో చూడండి అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆయ‌న మీద ప‌లువురు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య మూడో డిబేట్ జ‌రిగింది. ఇందులో ఇద్దరు పర్యావరణ మార్పులపై మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్‌పై అక్కసును బ‌య‌ట‌పెట్టారు. భారత్ ప‌ర్యావ‌ర‌ణాన్ని కలుషితం చేస్తోందని ఆరోపించారు. భారత్ మురికి దేశమంటూ ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై డెమొక్రటిక్ నేత జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రదేశాలతో అలా మాట్లాడడం సరికాదని తెలిపారు. వాతావరణ మార్పు సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని తెలిపారు. వాటిని పరిష్కరించే మార్గం చెప్పాలికానీ ఇలా అన‌డం స‌బ‌బు కాద‌ని తెలిపారు. ఇండియాతో అమెరికా భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు.

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!