NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చూసి చూసి ‘ బండి ‘ ను కదలనివ్వకుండా చేసిన టీఆరెఎస్ పార్టీ

ప్రస్తుతం తెలంగాణ లో రాజకీయాలు మంచి హీట్ పైన ఉన్నాయి. బిజెపి గత రెండు ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులలో కలకలం మొదలైంది. వీరేమో గెలుపు లో ఉంటే వారు మొట్టమొదటిసారి ఎదురవుతున్న ప్రతిఘటనను తట్టుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ జగిత్యాల పర్యటనలో ఆ ఎఫెక్ట్ కనపడింది…

 

వారంటే విరుచుకుపడతాడయే…

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ సందర్భానుసారంగా కేసీఆర్ కుటుంబంలోని కేటీఆర్, కవిత హరీష్ రావు పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక దుబ్బాక ఎన్నికల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ఇతని నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. కేసీఆర్ పై భారీ ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న సంజయ్ పై బిజెపి నేతలు టిఆర్ఎస్ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో జగిత్యాల లో పర్యటించిన బండి సంజయ్ ను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అతని పర్యటన ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ముందు నుండి ఆందోళన చేపట్టేందుకు రెడీ అయి ఉన్నారు.

ఆ నిధులు రావలసిందే…

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే… కొత్త డిమాండ్లతో టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ ను అడ్డగించారు. తెలంగాణలోని గ్రామపంచాయతీలో కు రావలసిన రూ. 1024 కోట్ల నిధులతోను విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ నిధులను తమకు ఇవ్వాలని అయితే ఇంకా ఇవ్వలేదని చెప్పి వాటిని తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఫ్లకార్డులతో కూడా ఆ నిధులను డిమాండ్ చేస్తూ ప్రదర్శించారు. దీంతో జగిత్యాల థరూర్ బ్రిడ్జి పైన విపరీతమైన టెన్షన్ నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్ లతో టీఆరెఎస్ నేతలు ఈ నిరసన చేయడం జరిగింది.

తీవ్ర ఉద్రిక్తత…

మరోవైపు బిజెపి నేతలు ఇలా తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ని ఎలా అడ్డుకోవడంతో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంతేకాకుండా వారు ఇలా అడ్డుకోవడానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా చేయడం జరిగింది. నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు జగిత్యాల లో నిర్వహించిన కిసాన్ సమ్మేళన్ లో పాల్గొనేందుకు బండి సంజయ్ వెళ్ళినప్పుడు ఈ గొడవ చోటు చేసుకోవడం గమనార్హం.

Related posts

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?