NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తీర గ్రామాల్లో రేపు మంత్రి అప్పలరాజు పర్యటన..! కీలక నిర్ణయానికి అడుగులు..!!

చీరాల నియోజకవర్గం కటారిపాలెం, వాడరేవు మత్స్యకారుల వలల వినియోగంపై ఇటీవల ఘర్షణ జరగడం దాదాపు 12 మంది గాయపడటం తెలిసిందే. బల్లవల, ఐల వల విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవలు జరిగాయి. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ ఇటీవల వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరాంలతో కలిసి ఆ ప్రాంతాల్లో పర్యటించి సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరిపినా అవి విఫలం అయ్యాయి. రెండు గ్రామాలకు చెందిన మత్స్య కారులు ఏకాభిప్రాయానికి రాలేదు. వివాదం అంతే కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రి సిదిరి అప్పలరాజు తాను వెళ్లి రెండు వర్గాల మధ్య వివాద పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వలల వివాదం చాలా చోట్ల ఉందనీ, దీనిపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఫోన్ లో మాట్లాడారని మంత్రి తెలిపారు,. మంత్రి అప్పలరాజు ఇచ్చిన హామీ మేరకు సోమవారం రెండు వర్గాలతో చర్చించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కారంచేడు మత్స్య అభివృద్ధి అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాడరేవు, కటారిపాలెం మత్స్యకారుల మద్య బల్ల వల, ఐలవల వినియోగంపై ఏర్పడిన వివాదాలపై చర్చించేందుకు మంత్రి అప్పలరాజు సోమవారం మధ్యాహ్నం రెెండు గంటలకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాడరేవు గ్రామం నుండి అయిదుగురు, కటారిపాలెం నుండి అయిదుగురు చొప్పున ప్రతినిధులు తమ అధార్ కార్డులు, రేషన్ కార్డులతో హజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N