NewsOrbit
న్యూస్ హెల్త్

జుట్టు ఎందుకు ఊడిపోతోందో ఎప్పుడైనా  ఆలోచించారా ??

జుట్టు మృదువుగా,ఒత్తుగా పట్టుకుచ్చులా ఉంటే ఎంతో అందం గా ఉంటుంది. జుట్టు  మూడు పొరలుగా వేల కణాలతో కూడి ఉంటుంది. వెంట్రుకలకు తగిన తేమ దొరకనప్పుడు జుట్టు పొడి బారిపోయి మెరుపు తగ్గిపోయి జీవం లేకుండా కనబడతాయి.

స్త్రీ పురుషులిద్దరికీ ఏ వయస్సులో అయినా పొడి జుట్టు రావచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. సరైన పోషకాలు అందనప్పుడు, అనారోగ్యంఉన్నప్పుడు జుట్టుకు హాని జరుగుందట. ముఖ్యంగా బాగా వేడి పరికరాల  ఒత్తిడి వల్ల జుట్టు కొసలు చిట్లిపోతాయి .

పోషకాహార లోపం స్టయిలింగ్ ఉత్పత్తులు  అంటే స్ప్రే,జెల్, వ్యాక్స్ లు అధికంగా వాడడటం,హాట్ కొమ్బ్స్, బ్లో డ్రయర్ లు, వంటి స్టయిలింగ్ టూల్స్ అతిగా వాడడం వలన గాఢత ఎక్కువ ఉన్న షాంపూ లతో  అతిగా తలస్నానం చేయడం, అధిక కెమికల్ ట్రీట్ మెంట్స్, సరిగ్గా చిక్కులు తీసుకోకపోవడం. అలంకరణ హెయిర్ కేర్ ఉత్పత్తులు అధికం గా వాడడం, ఎక్కువ వేడినీరు ఉపయోగించడం కారణమంటున్నారు.ఇంకా శరీరానికి కావలిసినంత నీరు తాగక పోయిన కూడా జుట్టు ఊడి పోతుంది.

ఒక్కొక్కసారి ఆహారపు అలవాట్లలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా జుట్టు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. హఠాత్తుగా చేసే డైట్ వలన, మాంసాహారం ఎక్కువగా తినడం లేదా కేవలం కూరగాయాలు మాత్రమే తినడం కారణంగా కూడా  పోషకాహార లోపం తలెత్తి, ఐరన్, జింక్ కొరత వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతాయి. జింక్, బయోటిన్ సప్లిమెంట్స్ మూడు నెలలపాటు తీసుకోవడం ద్వారా ఈ జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది.

టెలోజెన్ ఎఫ్లూవియంఈ సమస్య ఒత్తిడి కారణంగా వస్తుంది. జుట్టు కుదుళ్ల దగ్గర పెరుగుదల ఆగిపోతుంది. ఇది ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలోబాగా తెలుస్తుంది. ఇదిచాల కాలం పాటు లేదా తక్కువ కాలం ఉండొచ్చు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju