prabhas : ప్రభాస్ ఆదిపురుష్ రీసెంట్ గా షూటింగ్ మొదలైంది. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రాముడిగా నటిస్తున్న ప్రభాస్ పోస్టర్ అలాగే రావణుడిగా లంకేష్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ పోస్టర్ ని ఇది వరకే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ప్రభాస్ ఆదిపురుష్ నుంచి అధికారకంగా వెల్లడైంది ఈ రెండు పోస్టర్స్ మాత్రమే. అయితే మేకర్స్ ఆది పురుష్ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఇందులో పోషించే ప్రధాన పాత్రలకి సంబంధించిన విషయంలో రక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
గతకొంతకాలంగా ఆదిపురుష్ లో నటించబోయే సీత పాత్ర అలాగే లక్ష్మణ పాత్రలలో నటించేది వీరే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా ప్రభాస్ లేకుండా వీఎఫెక్ట్స్ కి సంబంధించిన షాట్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా కీలక పాత్రలని రివీల్ చేయమన్నట్టుగా ప్రభాస్ ఫ్యాన్స్ మెకర్స్ ని కోరుతున్నారు. అంతేకాదు ఆయా పాత్రలకి సంబంధించి కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడు సోదరుడు లక్ష్మణుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ నటించనున్నాడని వార్తలు మొదలయ్యాయి.
prabhas : ఆ వార్తలో నిజమెంత అన్న కన్ఫ్యూజన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ..?
ఇందులో ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేనప్పటికి ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా బాలీవుడ్ లో ప్రభాస్ చేస్తున్న స్ట్రైట్ సినిమా కావడం.. అదీకాకా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ న్యూస్ నిజమని చెప్పుకుంటున్నారు. ఇక సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాని 3డి విజువల్ గ్రాఫిక్స్ తో ఒక వండర్ లా రూపొందించనున్నారు. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!