NewsOrbit
Featured బిగ్ స్టోరీ

YS Viveka Murder Case ; ఏపీలో ఇదే సంచలనం..! మెడలో బాబాయ్ కేసు – డీల్ చేయడం అంత ఈజీ కాదు..!!

YS Viveka Case: CBI Mind Game with Criminals..?

YS Viveka Murder Case ; చనిపోయింది సొంత బాబాయ్.. చంపింది దగ్గర వాళ్లే.. దోషులను తేల్చమని అడుగుతున్నది బాబాయ్ కూతురు… చంపింది ఎవరనేది స్పష్టత లేదు, కారణాలు ఏమిటనేది తెలియదు, ఈ వ్యవహారం మొత్తం సీఎం జగన్ కె ఇబ్బందికరం కాబోతుంది.. ఆయన మెడకే ఈ తలనొప్పి చుట్టుకుంటుంది.. దీనిపై తేల్చాల్సింది ఆయనే, దోషులను గుర్తించి, శిక్ష పడేలా చేయాల్సింది కూడా ఆయనే… తాను ఈ టర్మ్ లో సీఎంగా ఉన్న సమయంలో దీన్ని డీల్ చేసి, కేసుని క్లోజ్ చేస్తే నిజంగా తనొక సాహసి కిందకే వస్తారు..!!

YS Viveka Murder Case ; సునీత వదలరు అనేది స్పష్టం..!!

YS Viveka హత్యా కేసులో మూలాల్లోకి వెళ్లి, శోధించి.., వాస్తవాలు తేల్చి.. దోషులను శిక్షించే వరకు వివేకా కుమార్తె సునీత రెడ్డి వదిలిపెట్టరు అనేది మాత్రం స్పష్టం. ఆమె మాటల్లో ధాటి, ఆమె మాటల్లో ఆవేదన, ఉద్వేగం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె ఈ కేసులో ఎంత వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఈ కేసుని వదిలెయ్యాలి.. జనం మర్చిపోయేలా చేయాలి అని ఓ వర్గం భావించినా అది అయ్యే పని కాదు. ప్రతీ ఆరు నెలలకోసారి సునీత కచ్చితంగా మూలాల్లోకి వెళ్లి, జనాలకు గుర్తు చేస్తారు..!

YS Viveka Murder Case ; Big Sensation in AP Politics
YS Viveka Murder Case ; Big Sensation in AP Politics

అనుమానితులు దగ్గరోళ్లే..!?

ఓవరాల్ గా వైఎస్ వివేకా (YS Viveka) హత్యా కేసులో అనుమానితులు ఎవరనేది తెలుసు. పోలీసుల దర్యాప్తు.., సీబీఐ దర్యాప్తులో కొన్ని కామన్ పేర్లు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికీ తేలాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. * నైట్ వాచ్ మెన్ రంగన్నకి తెలియకుండా హంతకులు ఇంటిలోపలికి ప్రవేశించే అవకాశమే లేదు. ఘటన జరిగిన తర్వాత ఉదయం చాల సమయం వరకు రంగన్న ఫోన్ ఎందుకు అందుబాటులో లేదు?
* వివేకా మృతదేహంపై గాయాలు బహిర్గతమయ్యే వరకు గుండెపోటు అని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఎవరు..? ఎందుకు చేశారు..!? * కేసు నమోదు చేయవద్దంటూ గంగిరెడ్డి మొదట్లోనే పోలీసులపై ఒత్తిడి చేసినట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది. రక్తపు మరకలు కూడా పనిమనిషి తుడిచేసారు..! * డాక్టర్ శివశంకరెడ్డి కూడా వివేకా చనిపోయిన రూమ్ కి వెళ్లి మృతదేహంపై గాయాలని మాయం చేసే ప్రయత్నం చేశారా.!? ఆయన ఎందుకు వివరాలను బయటకు చెప్పడం లేదు..! * ఏడాదిన్నర కిందట వేసిన సిట్ లో అధికారులని మూడు సార్లు ఎందుకు మార్చారు? డిజి స్థాయి సిట్ అధికారి నుండి ఎస్పీ స్థాయికి ఎందుకు మార్చారు? * పోలీసులు అసలు అనుమానితుల కాల్ డేటా పరిశీలించారా? * ప్రధాన అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి హత్య జరిగిన రోజునే ఆసుపత్రిలో చేరడం.. ఆ తరువాతి రోజు హరిత హోటల్ లో టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవిని కలవడం స్పష్టత రావాల్సిన అంశాలే..! వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిల పాత్ర.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రపై ఇప్పటికీ స్పష్టత లేదు..! మొత్తం కేసులో ఆ ఇంటికి, ఆ మనుషులను దగ్గరి వాళ్ళే హంతకులు అనేది మాత్రం అర్ధం చేసుకోవచ్చు. నిన్న సునీత మాటల్లో కూడా ఇదే తరహా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

YS Viveka Murder Case ; Big Sensation in AP Politics
YS Viveka Murder Case ; Big Sensation in AP Politics

దర్యాప్తు ఎందుకు ఆపేస్తున్నట్టు..!?

వివేకా హత్యా కేసులో పోలీసులు, సీబీఐ కూడా దర్యాప్తుని ఆకస్మికంగా ఆపేయడమే పెద్ద చిక్కు ప్రశ్నగా మారింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన సిట్ దాదాపు మూడు నెలలు సీరియస్ గా దర్యాప్తు చేసింది. సుమారుగా 1200 మందిని విచారించారు. కొందరు అనుమానితుల ఫోన్ కాల్ డేటా కూడా పరిశీలించారు. కానీ కేసుని ఫైనల్ చేయలేదు. ఏదీ తేల్చలేదు. తర్వాత హైకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన సీబీఐ కూడా మొదట్లో దూకుడుగా దర్యాప్తు ఆరంభించింది. గత ఏడాది జులై నుండి సెప్టెంబర్ మధ్య వరకు రెండు దశల్లో విచారణ చేసి.. కొన్ని ప్రాధమిక ఆధారాలు సేకరించింది. అనధికార లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా, డబ్బు వ్యవహారాలు పసిగట్టింది. కానీ కేసుని చివర్లో వదిలేసింది. గత ఏడాది సెప్టెంబర్ నుండి ఈ కేసు మళ్ళీ ముందుకు వెళ్ళలేదు. అందుకే విచారణ తీరుపై కూడా సునీత కొన్ని అనుమానాలు లేవనెత్తుతూ ఆవేదన, ఆందోళనని కలిపి మాట్లాడుతున్నారు.. ఎవరు ఎన్ని చేసినా… సునీత ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా… ఈ కేసుని క్లోజ్ చేయాల్సింది సీఎం జగన్. ఆయనపైనే బాధ్యత ఉంది. సీఎం కాకా మునుపు సీబీఐ దర్యాప్తు జరగాలి అని కోరిన ఆయన సీఎం అయిన తర్వాత.. పోలీసుల దర్యాప్తు ప్రాధమిక నివేదిక అందిన తర్వాత సీబీఐ దర్యాప్తు వద్దు అనేసారు. సైలెంట్ అయిపోయారు. సో… ఈ కేసులో ఏదో ఒక సంచలన అంశం ఉన్నట్టే కనిపిస్తుంది..!!

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju