NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

JD Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ పెద్దలు గతంలో చాలా సార్లు సెలవు ఇచ్చారు. కానీ ఏపీలోని రాజకీయ నాయకులు మాత్రం ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు పాడిందే పాటరా పాటిపళ్ల దాసర అన్న చందంగా ప్రత్యేక హోదా అంటూనే ఉన్నారు.

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటి పోయింది. విభజన హామీలు గాలికిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. గత ఎన్నికల సమయంలో 25 పార్లమెంట్ సభ్యులను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి 22 లోక్ సభ స్థానాలు కట్టబెట్టారు.

అయితే రాష్ట్ర ఎంపీలతో అవసరం లేకుండానే కేంద్రంలో బీజేపీ 300కుపైగా స్థానాలతో ఫుల్ ప్లెడ్జ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పట్లోనే సీఎం జగన్ చేతులు ఎత్తేశారు. మన పార్లమెంట్ సభ్యుల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినందున గొడవ చేయడం వల్ల ఉపయోగం లేదని ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటామని చెప్పారు జగన్. అప్పుడు చెప్పినట్లుగా ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి తన విజ్ఞాపనలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రసావిస్తూనే ఉన్నారు.

కేంద్రంతో కయ్యం పెట్టుకోకుండా అవసరానికి అప్పులు సాధించుకుంటూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలునకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెట్టుకు వస్తున్నారు. ఇక మూడు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో ఓటమి తర్వాత జ్ఞానోదయం అయ్యింది. కేంద్రంలోని బీజేపీ (మోడీ, షా ద్వయం) అండలేకపోతే ఎంత నష్టం జరుగుతుందో అర్ధం అయ్యింది. దీంతో బీజేపీ (ఎన్డీఏ) తనకు తలుపులు ఎప్పుడు తెరుస్తుందా వెళ్తామన్న ఆలోచనలో ఉన్నారు.

నేరుగా ఎన్డీఏలో లేకపోయినా ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్రపక్షంగానే వ్యవహరిస్తూ వస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఈ రెండు పార్టీలు కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల .. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ తదితర అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుంటున్నారు. ఈ అంశాలపై ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు వైఎస్ షర్మిల.

ఇదే సమయంలో జై భారత్ నేషనల్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విశాఖలో ఒక రోజు దీక్ష చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ అధికార ప్రతిపక్ష నేతలు సీఎం వైఎస్ జగన్, చంద్రబాబుకు లక్ష్మీనారాయణ కీలక సూచన చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఏపీకి ప్రత్యేక హోదా పొందడానికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిల్లు(ఓటాన్ అకౌంట్ బడ్జెట్) ను పార్లమెంట్ లో ఆమోదం పొందకుండా నిలిపివేయాలని సూచించారు.

ఇది చేసి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో చిత్తశుద్ది నిరూపించుకోవాలని జై భారత్ నేషనల్ పార్టీ అధినేతగా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కేంద్రంతో అంటకాగుతున్న జగన్ గానీ, అవకాశం ఇస్తే చంక ఎక్కడానికి సిద్దంగా ఉన్న చంద్రబాబు గానీ జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచనను పట్టించుకునే అవకాశం ఉంటుందా అంటే లేదనే చెప్పవచ్చు. చెవిటివాటి ముందు శంఖం ఊదినట్లు జేడీ లక్ష్మీనారాయణ కంఠశోషను ఈ నేతలు పరిగణలోకి తీసుకునే అవకాశమే లేదు.

AP Cabinet: 6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ .. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవి

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju