Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” సలార్ “. గత సంవత్సరం రిలీజ్ అయినయి మూవీ థియేటర్లని షేక్ చేసిందని చెప్పొచ్చు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ భారీ వసూళ్లను కూడా దక్కించుకుంది.
ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఇందులో ఉన్న కొన్ని విషయాలని బయటపెడుతున్నారు ట్రోలర్స్. అలా ప్రస్తుతం ప్రభాస్ సెట్ చేసిన ఓ విచిత్రమైన రికార్డ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ప్రభాస్ సలార్ మూవీ మొత్తంలో కేవలం రెండు నిమిషాల 35 సెకండ్లు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. ఇక అదే విధంగా ప్రభాస్ ఈ సినిమాలో నటించేందుకు గాను రూ. 125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక దీని బట్టి చూసుకుంటే ఒక్క సెకండ్ కి గాను 80 లక్షలు డిమాండ్ చేశాడు ప్రభాస్.
ప్రభాస్‌కి ఒక్క నిమిషానికి ఇచ్చే రెమ్యూనరేషన్ తో ఓ సినిమానే తీసేయవచ్చు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంత అద్భుతమైన అవార్డ్ ఒక్క ప్రభాస్‌కి మాత్రమే సొంతం. హీరోలు సంవత్సరాలు పాటు కష్టపడినా రాని రెమ్యూనరేషన్ ని ఒక్క నిమిషంలో తీసుకున్నాడు ప్రభాస్. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.