NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

YSRCP: సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తొంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే 50కిపైగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను లోక్ సభ ఇన్ చార్జిలుగా, లోక్ సభ సభ్యులను అసెంబ్లీ ఇన్ చార్జిలుగా నియమించారు.

లోక్ సభ సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్ధులుగా వెళ్లడానికి ఇష్టపడుతుండగా, ఎమ్మెల్యేలు మాత్రం లోక్ సభ కు పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఎంపీ టికెట్ వద్దు – ఎమ్మెల్యే టికెట్ యే ముద్దు అన్నట్లుగా చెబుతున్నారు. పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలంటే ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అడు అసెంబ్లీ సిగ్మెంట్ లో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

నియోజకవర్గానికి పది నుండి 15 వేసుకున్నా మొత్తంగా వంద కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత నిధులు ఖర్చు చేసినా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల హవానే కొనసాగుతుంది. నేరుగా లోక్ సభ సభ్యుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, లేదా మంత్రిని కాదని ఏమీ చేయలేని పరిస్థితి. పారిశ్రామిక వేత్తలు అయితే ఢిల్లీలో లాబీయింగ్ చేసుకోవడానికి ఎంపీ పదవి ఉపయోగించుకోవచ్చు కానీ సాధారణ రాజకీయ నాయకులు మాత్రం లోక్ సభకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.

YSRCP CM YS Jagan

ఢిల్లీలో నెట్టుకు రావాలంటే హిందీ లేదా ఇంగ్లీషు భాష తప్పకుండా వచ్చి ఉండాలి. ఒక వేళ భాషలు వచ్చినా ప్రతిపక్ష ఎంపీలను పెద్దగా ఢిల్లీలో పట్టించుకోరు. తదితర కారణాల రీత్యా ఎక్కువ మంది లోక్ సభకు పోటీ చేయడానికి వెనకడుగు వేస్తున్నారుట. వైసీపీకి ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉండగా, వారిలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మొదటి నుండి పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. మిగిలిన 21 మందిలో ఎక్కువ మంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.

ఇప్పటి వరకూ వైసీపీ తొమ్మిది లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జిలను నియమించింది పార్టీ. కర్నూలు ఎంపీ స్థానానికి ప్రస్తుతం ఉన్న డాక్టర్ సతీష్ కుమార్ ను పక్కన పెట్టి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు ఇన్ చార్జిగా నియమించారు. జయరాం లోక్ సభకు పోటీ చేయడానికి సుముఖంగా లేరు. తాను ఎంపీగా పోటీ చేయనని సీఎం వద్ద చెబుతున్నారు. అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యే స్థానానికి మార్చి ఆమె స్థానంలో ఎమ్మెల్యే కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మిని లోక్ సభ అభ్యర్ధిగా ప్రకటించారు. ఇందుకు ఆమె సుముఖంగా లేరని సమాచారం.

తిరుపతి ఎంపీగా ఉన్న డాక్టర్ గురుమూర్తిని సత్యవేడుకు పంపి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించగా, ఆయనా సుముఖత వ్యక్తం చేయడం లేదు. అలానే ఏలూరు లోక్ సభ స్థానానికి ఇన్ చార్జిగా నియమితులైన కారుమూరు సునీల్ కుమార్ యాదవ్, అనంతపురం లోక్ సభ ఇన్ చార్జిగా నియమితులైన మంత్రి శంకర నారాయణ, చిత్తూరు లోక్ సభ అభ్యర్ధి నారాయణ స్వామిలు సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం.

మంత్రి విడదల రజినిని నరసరావుపేట లోక్ సభ స్థానానికి, మంత్రి రోజాను ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని పార్టీ నేతలు ప్రతిపాదిస్తే తాము ఎమ్మెల్యేగానే  పోటీ చేస్తామని తెలియజేసారుట. విశాఖ లోక్ సభ స్థానానికి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి జాన్సీని ఎంపిక చేయగా, గతంలో చేసిన అనుభవం, రాజకీయ కుటుంబ నేపథ్యం కారణంగా సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. అభ్యర్ధులు వెనకడుగు వేస్తున్న కారణంగా ఇప్పటి వరకూ ప్రకటించిన స్థానాల్లో పలువురి మార్పులు ఉండవచ్చని అంటున్నారు.

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల .. పోలింగ్ ఎప్పుడంటే ..?

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N