NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Ukraine Crisis: రష్యాపై విరుచుకుపడ్డ అగ్రరాజ్య అధినేత జోబైడెన్..కీలక వ్యాఖ్యలు..

Ukraine Crisis: ఉక్రెయిన్‌ ను వశం చేసుకునేందుకు రష్యా యుద్దం చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతినుద్దేశించిన బైడెన్ చేసిన ప్రసంగంలో ఉక్రెయిన్ – రష్యా యుద్ధంపై మాట్లాడారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చుట్టుముట్టి యుద్ధ ట్యాంకులతో రష్యా దాడి చేస్తోందనీ, ఉక్రెయిన్ ప్రజల హృదయాలను రష్యా ఎప్పటికీ పొందలేదని బైడెన్ అన్నారు.  ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ తరపున అమెరికా సేనలు యుద్ధం చేయవు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ను రష్యా వశం కానివ్వమని అన్నారు. నియంత పుతిన్ అంతు చూస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను రష్యా ముట్టడించినా ప్రజల మనసులు పునిత్ గెలుచుకోలేరని బైడెన్ అన్నారు.

Ukraine Crisis America President Joe Biden key comments on russia
Ukraine Crisis America President Joe Biden key comments on russia

Read More: Breaking: ఈయూ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు సభ్యత్వం

Ukraine Crisis: ఆమెరికాలో రష్యా విమానాలపై నిషేదం

రష్యా ఆర్ధిక వ్యవస్థను స్తంభింపచేస్తామని  బైడెన్ హెచ్చరించారు. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు, నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాయని అన్నారు. యుద్దరంగంలో పుతిన్ లాభపడొచ్చు కానీ దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించకతప్పదని బైడెన్ హెచ్చరించారు. ఆమెరికాలో రష్యా విమానాలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. పుతిన్ ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్ అన్నారు.  కాగా గత ఆరు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో పౌరులు సైతం తుపాకి చేతపట్టి రష్యా సేనలతో తలపడుతున్నారు. రష్యా సేనలను ఉక్రెయిన్ పౌరులు అడ్డుకుంటున్నారు.

ఆణ్యస్త్ర దళాలను అప్రమత్తం చేసిన రష్యా

రష్యా క్షిపణుల దాడిలో ఉక్రెయిన్ లోని పెద్ద ఎత్తున నివాస భవనాలు ధ్వంసమవుతున్నాయి. అనేక మంది పౌరులు మృత్యువాతపడుతున్నారు.  మరో పక్క సైబీరియాలో సైనిక డ్రిల్స్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. బారెంట్స్ సముద్రంలోకి రష్యా అణు జలాంతర్గాములు ప్రవేశించాయి. సైబీరియాకు మొబైల్ క్షిపణి లాంఛర్లును రష్యా తరలించింది. విన్యాసాల్లో అణు జలాంతర్గాములు, యుద్ధ నౌకలు పాల్గొంటాయని రష్యా పెర్కొంది. రష్యా ఆణ్యస్త్ర దళాలను అప్రమత్తం చేయడంతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది.

Related posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju