NewsOrbit
రాజ‌కీయాలు

అంబటిపై కేసు నమోదు

సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడిలో వైసిపి నేత అంబటి రాంబాబు సహా మరో ఇద్దరిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

కోడెలపై దాడికి వీళ్లే కుట్ర పన్నారంటూ ఆయన తరుపు న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వైసిపి నేతలు అంబటి రాంబాబు,నిమ్మకాయల రాజనారాయణ,బాసు లింగారెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపి దాడిలో అంబటి పాత్ర ఉందా లేదా అన్నది నిర్ధారిస్తామని సత్తెనపల్లి డిఎస్‌పి కాలేషావలి తెలిపారు.

మరోవైపు కోడెలపై జరిగిన దాడిలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఇనుమట్ల గ్రామానికి  భారీగా పోలీసులు చేరుకున్నారు. సిసి ఫుటేజ్‌లను పరిశీలించారు. 30మందిపై కేసు నమోదు చేశారు. వారిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో మహిళలలు కూడా పాల్గొన్నారని సమాచారం.

సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సత్తెనపల్లి డిఎస్ పి కాలేషావలి రాజుపాలెంలో ఉండి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడిలో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.

ఏప్రిల్ 11వ తేదీన ఇనుమట్ల గ్రామంలో పోలింగ్ సరళి పరిశీలించడానికి వెళ్లిన సమయంలో కోడెలపై దాడి జరిగింది. కోడెల పోలింగ్ కేంద్రం వద్దకు రావడాన్ని నిరసిస్తూ..ఆయనపై కొందరు దాడికి దిగారు. కోడెల కారును ధ్వంసం చేశారు. దాడిలో కోడెల దుస్తులు చిరిగిపోయాయి. ఆయనతో పాటు డ్రైవర్‌కి గాయాలయ్యాయి. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇదిలా ఉంటే కోడెలపై దాడిని నిరసిస్తూ టిడిపి శ్రేణులు శనివారం నిరసన వ్యక్తం చేశాయి. సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురం కూడలిలో రాస్తారోకో నిర్వహించాయి. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. టిడిపి శ్రేణుల రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గుంటూరు, అమరావతి, సత్తెనపల్లి వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Related posts

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

Leave a Comment