NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: పేద విద్యార్ధుల ఫీజులకు వెనుకాడకుండా కోటి 80 లక్షల వరకూ చెల్లిస్తున్నాం – సీఎం జగన్

CM YS Jagan: రాష్ట్రంలో పేద విద్యార్ధుల చదువుల కోసం కోటి 80 లక్షల రూపాయల వరకూ ఫీజు కట్టడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా విద్యార్ధులకు సపోర్టు అందిస్తున్నామన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన చేపట్టామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చదువుపై దృష్టి పెట్టలేదన్నారు. క్వాలిటీ విద్యపై మన ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందన్నారు. అత్యుత్తమ కంటెంట్ తో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయవాడలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో టాపర్ లుగా నిలిచిన విద్యార్ధులను, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ ను సత్కరించారు.

CM YS Jagan speech in jaganAnna Aanimutyalu program Vijayawada

 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మట్టి నుండి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షలై రేపటి ప్రపంచానికి ఫలాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్ధికి డిగ్రీ పట్టా అందించడమే లక్ష్యంగా.. విద్యార్దుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు తీసుకువచ్చామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్ లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రతి విద్యార్ధికి ట్యాబులు అందజేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో సీటు సంపాదించి చదువుకునే విద్యార్ధుల ఫీజులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

jaganAnna Aanimutyalu program Vijayawada

జగనన్న ఆణిముత్యాలు పేరుతో పదవ తరగతి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కు లక్ష, ద్వితీయ ర్యాంకర్ కు రూ.75వేలు, తృతీయ ర్యాంకర్ కు రూ.50వేలు ప్రోత్సాహకాలను అందించారు. మొత్తం 42 మంది టెన్త్ విద్యార్ధులు ఈ సత్కారాలకు ఎంపికైయ్యారు. జిల్లా స్థాయి టాప్ ర్యాంకర్ లకు రూ.50వేలు, రూ.30వేలు,15వేలు ఇస్తున్నారు. వీటికి 609 మంది విద్యార్ధులు ఎంపికయ్యారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో నగదు పురుస్కారాలకు 681 మంది ఎంపిక అవ్వగా, వీరికి రూ.15వేలు, 10వేలు, రూ.5వేలు అందజేయనున్నారు. పాఠశాల స్థాయిలో 20,229 మంది విద్యార్ధులకు రూ.3వేలు, రూ.2వేలు, వెయ్యి రూపాయల చొప్పున ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్ధులకు అందించనున్నారు. అదే విదంగా ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో గ్రూపుల వారీగా 26 మంది టాపర్ లు ఎంపికైయ్యారు. వీరికి లక్ష చొప్పున పురస్కారం ఇస్తారు. జిల్లా స్థాయిలో గ్రూపుల వారిగా 391 మంది టాపర్ లకు రూ.50ల చొప్పున, నియోజకవర్గ స్థాయిలో 662 మంది టాపర్ లకు రూ.15వేల వంతున నగదు పురస్కారాలను అందజేయనున్నారు.

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ .. కీలక వ్యాఖ్యలతో..

Related posts

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!