NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana MLA Rajaiah VS Kadiyam Srihari: ప్రగతి భవన్ కు చేరిన స్టేషన్‌ఘన్ పూర్ పంచాయతీ .. ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటిఆర్ క్లాస్

Telangana NewsOrbit: స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎన్ నేతల మధ్య పంచాయతీ ప్రగతి భవన్ కు చేరింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మద్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతి భవన్ కు పిలిపించిన మంత్రి కేటిఆర్ ..కడియంపై చేసిన వ్యాఖ్యలకు వివరణ తీసుకున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో మరో సారి ఇలాంటివి రిపీట్ కావద్దంటూ రాజయ్యకు మంత్రి కేటిఆర్ హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీ అంతర్గత గొడవల వల్ల ప్రభుత్వం, పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తొంది. కాగా ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యమంత్రి కేటిఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ లో వేచి ఉన్నా అపాయింట్మెంట్ లభించకపోవడంతో వెనుతిరిగినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టికెట్ మళ్లీ కేటాయిస్తారా లేదా అన్న గందరగోళంలో రాజయ్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

KTR reprimands MLA Rajaiah to work closed with Kadiyam Srihari
Telangana: KTR reprimands MLA Rajaiah to work closely with Kadiyam Srihari

ఎమ్మెల్యే రాజయ్య – ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు బహిరంగంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కడియం శ్రీహరిపై రాజయ్య మాటల దాడి మరింత పెంచారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కడియం శ్రీహరి కలిశారనీ, తనతో పాటు తన కుమార్తె కావ్యకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగారనీ, త్వరలోనే ఆధారాలు బయటపెడతాననీ కూడా అన్నారు. దానికి తోడు కడియం కులాన్ని తీసి మరీ విమర్శలు చేశారు. కడియం పద్మశాలీ కులానికి చెందిన వాడనీ, కానీ 60 ఏళ్లుగా రిజర్వేషన్లు అక్రమంగా పొందుతున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడా కడియంకు ఉన్నాయని కూడా ఆరోపించారు. రాజయ్య ఆరోపణలను కడియం శ్రీహరి ఖండించారు. తనకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అధారాలతో సహా తీసుకువస్తే స్టేషన్ ఘన్ పూర్ దళిత సోదరులకు రాసి ఇస్తానని చెప్పారు. తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాను అక్రమంగా రిజర్వేషన్ పొందలేదన్నారు. 

తనపై రాజయ్య నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కడియం శ్రీహరి. మరో పక్క రాజయ్యపైనా ఆరోపణలు చేశారు. దళిత బంధులో ఎమ్మెల్యే రాజయ్య కమిషన్లు దండుకున్నారనీ, బీఫామ్ లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇలా ఇద్దరు పార్టీ లైన్ దాటి మరీ పరస్పర విమర్శలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటిఆర్ స్పందించి రాజయ్యకు క్లాస్ పీకడం జరిగింది. దీంతో అయినా స్టేషన్ ఘన్ పూర్ లో ఇద్దరు నేతలు కామ్ గా ఉంటారా అనేది వేచి చూడాలి.

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N