NewsOrbit
జాతీయం న్యూస్

కూనో జాతీయ పార్క్ లో మృత్యువాత పడిన మరో చిరుత

ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుండి బారత్ (కునో పార్క్) కు తీసుకువచ్చిన చిరుత పులులలో మరొక చిరుత (ధాత్రి, ఆడ చీతా) బుధవారం మృత్యువాత పడింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ధాత్రి మరణానికి గల కారణం పోస్టుమార్టం పరీక్షల ఫలితాల అనంతరం తెలుస్తుందని తెలిపింది. కాగా, గత ఆరు నెలల కాలంలో మొత్తం ఎనిమిది చిరుతలు మృతి చెందాయి. ధాత్రి మృతితో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. అంతరించిపోతున్న వన్య ప్రాణుల సంరక్షణ కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రాజెక్టు చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా నుండి ప్రత్యేక విమానాల్లో రెండు విడతలుగా 20 చిరుతలను తీసుకురావడం జరిగింది. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూనో పార్క్ లో వదిలారు.

cheetah Dhatri dies kuno national park.

 

అయితే ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతూ వచ్చాయి. గత నెలలో నాలుగు రోజుల వ్యవధిలో రెండు చిరుతలు మృత్యువాత పడ్డాయి. వరుసగా చిరుతల మృతి క్యూనో జాతీయ వనం వర్గాలను కలవరానికి గురి చేస్తొంది. నమీబియా నుండి తీసుకొచ్చిన చీతాకు నాలుగు పిల్లలు జన్మించగా, అందులో మూడు ప్రాణాలు కోల్పోయాయి. ఫలితంగా మొత్తం చీతా మరణాల సంఖ్య తొమ్మిదికి చేరినట్లైయింది. జీవించి ఉన్న పిల్ల చిరుతలను నిపుణుల సమక్షంలో పెంచుతున్నారు. ప్రస్తుతం కూనో పార్క్ లో ఇంకా 14 చిరుతలు ఉన్నాయి. వీటిలో ఒక ఆడ చిరుతను ఎన్ క్లోజర్ నుండి బయటకు వదిలి నిశితంగా పరిశీలిస్తున్నారు. దానిని తిరిగి ఎన్ క్లోజర్ లోకి తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలను చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు వివరించారు.

క్యూనో పార్క్ లో చిరుతలు వరుసగా మృతి చెందడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.  సైన్స్ కు, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే జరిగేది ఇదేనంటూ వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తి గర్వం, వ్యక్తిగత ప్రతిష్ఠకు పెద్ద పీట వేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని పరోక్షంగా మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఢిల్లీ వేదికగా నేడు బీజేపీ, కాంగ్రెస్ లో తెలంగాణ నేతలు చేరికలు..బీజేపీలో జయసుధ, కాంగ్రెస్ లో జూపల్లి అండ్ టీమ్

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?