NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబు తరపున కోర్టులో రెండు కీలక పిటిషన్లు …కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీబీఐ పిటిషన్

chandrababu reaction about CID comments

Chandrababu: స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు తరపున న్యాయవాదులు రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. ఆరోగ్య రీత్యా చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్టు గా మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరో పిటిషన్ ను వేశారు. మరో పక్క చంద్రబాబును కస్టడీలోకి విచారణ జరిపేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనున్నది.

ACB remand Chandrababu naidu,
Chandra Babu Bail Plea skill development scam case

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో నిన్న ఉదయం నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాల నుండి రోడ్డు మార్గం గుండా విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించిన సీఐడీ అధికారులు శనివారం రాత్రి సుదీర్ఘంగా విచారణ చేశారు. ఈ సందర్భంలో చంద్రబాాబు విచారణకు సహకరించలేదని సమాచారం.

దాదాపు 20 ప్రశ్నలను సంధించగా వాటికి తెలియదు, గుర్తు లేదు అన్నట్లుగా సమాధానం చెప్పినట్లు తెలుస్తొంది. కాగా ఆదివారం వేకువ జామున చంద్రబాబుకు వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హజరుపర్చగా, రిమాండ్ అంశంపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. కోర్టులో ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి.

Unexpected scene in ACB court while Chandrababu was in court cage
 Chandra Babu Bail Plea skill development scam case

చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ద్ లూద్రా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు మధ్యాహ్నం వరకూ ముగించిన న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సాయంత్రం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాట్లను పోలీసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున బెయిల్ పిటిషన్ తో పాటు గృహ నిర్బంధం పిటిషన్ ను దాఖలు చేశారు.

Big Breaking: చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N