NewsOrbit
రాజ‌కీయాలు

‘దేశం కోసం ఈ ముగ్గురు కలవాలి’

అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌లు కలుస్తారని ఎవరైనా ఊహించగలరా ?  విభిన్న దృవాలైన వీరు కలవడం సాధ్యమేనా ?. ఈ భిన్న దృవాలు దేశం కోసం ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడుతున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ అవసరమనీ దీని కోసం వీరు ముగ్గురూ చేతులు కలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోది ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని నారాయణ అన్నారు. మే 23 తరువాత మోదికి పంగనామాలే మిగులుతాయని నారాయణ ఎద్దేవా చేశారు.

చాయ్ వాలా అని చెప్పుకునే మోది మేకప్ కోసం నెలకు 80లక్షలు ఖర్చులు చేస్తున్నారని నారాయణ విమర్శించారు.

సుప్రీంకోర్టు, సిబిఐ, ఆర్‌బిఐ, ఇడి వంటి స్వయం ప్రతిపత్తి సంస్థలను నడిరోడ్డుపై బట్టలు లేకుండా కేంద్రం నిలబెట్టిందని నారాయణ దుయ్యబట్టారు.

పుల్వామా ఉగ్రదాడిలో భారీ సంఖ్యలో జవాన్‌లు మృతి చెందడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని నారాయణ
ఆరోపించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని నారాయణ అన్నారు.

తెలంగాణాలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కెసిఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలనీ, విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నారాయణ డిమాండ్ చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ఎన్నికల్లో పోటీకే అనర్హురాలని నారాయణ అన్నారు.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

Leave a Comment