NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: ఇక నువ్వు నాకు అడ్డు చెప్పకు పంచమి నా నిర్ణయం మారదు అంటున్న మోక్ష…

Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights

Naga Panchami:  కరాలి అగ్నిలో ఆహుతి అయిపోతుంటే మహాకాళి ప్రత్యక్షమవుతుంది. నన్ను ఎందుకు బ్రతికించారు మహాకాళి అని నీలాంబరి అంటుంది. నువ్వు ఊహించుకున్నట్టు మోక్ష పంచమి ల కలయిక ఏమీ జరగలేదు అని మహాకాళి అంటుంది. నా కళ్ళతో నేను చూశాను మహాకాళి నా ఆశలన్నీ అడుగంటుకుపోయాయి ఇక నేను బ్రతకడం వృధా అని అంటుంది కరాలి. వాళ్లని ఒక గదిలోకి పంపించేంతవరకే నువ్వు చూసావు కదా  ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు కదా నువ్వు మోక్షాన్ని వశం చేసుకోవడానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది కార్తీక పౌర్ణమి వచ్చాక ఆ నాగిని మోక్షాన్ని కాటు వేసి చంపేస్తుంది ఆ లోపే నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని మహాకాళి వెళ్ళిపోతుంది. కృతజ్ఞతలు మహాకాళి నన్ను కాపాడినందుకు నేను అనుకున్న పని సాధిస్తాను అని నీలాంబరి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights
Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights

కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది నేను సుబ్బు చెప్పినట్టు దీపం పెట్టి పరమేశ్వరుని వేడుకోవాలి అని అనుకుంటుంది పంచమి. ఇంతలో మోక్ష వచ్చి ఏం ఆలోచిస్తున్నావు పంచమి ఇక మనిద్దరి మధ్య దాపరికలేమీ లేవు అంతా తెలిసిపోయింది అని అంటాడు. ఏమీ లేదు మోక్ష బాబు మీకు తెలిసిందే కదా అని పంచమి అంటుంది. నువ్వు ఎంత ఆలోచించినా నా చావు మాత్రం తప్పకుండా వస్తుంది పంచమి కానీ ఆ లోపు మన ఇద్దరం ఒకటి కావాలి లేదంటే నా చావుకు అర్థం ఉండదు పంచమి నువ్వైనా ఈ భూలోకంలో సంతోషంగా నా రూపాన్ని చూసుకుంటూ బ్రతుకు అని మోక్ష అంటాడు. అదే జరిగితే ఒక్క సెకండ్ ముందే నేను మరణిస్తాను మోక్ష బాబు అని అంటుంది పంచమి. నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నాను నువ్వేమో నీ ప్రాణం తీసుకుంటాను అంటున్నావ్ ఇదెక్కడి విచిత్రం పంచమి అని మోక్ష అంటాడు. మీరే లేనప్పుడు నేను ఉండడంలో అర్థం లేదు ఇదేనా నిర్ణయం అని పంచమి అంటుంది.అయితే నా నిర్ణయం కూడా విను పంచమి నేను బ్రతికేది కొన్ని రోజులే క్షణం ఒక యుగం లాగా గడిచిపోతుంది నేను చనిపోయిన నిన్ను బ్రతికించుకోవాలనేదే నా కోరిక ఈరోజే ఆ కార్యానికి ముహూర్తం ఇంక నువ్వు నాకు ఏమీ చెప్పకు పంచమి అని మోక్ష అంటాడు. ఇంతలో పంచమి వాళ్ళ అమ్మ వచ్చి నేను వెళ్లి వస్తాను పంచమి జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. అత్తయ్య నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మోక్ష తీసుకువెళ్తాడు.

Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights
Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights

కట్ చేస్తే, ఇంతలో ఫణేంద్ర వచ్చి చూడు పంచమి నీ విషయాలన్నీ నాకు తెలిసి పోయాయి వెంటనే నేను మన నాగులోకానికి వెళ్లి నాగదేవతకు చెప్పాను నాగదేవత నాకు మోక్షాన్ని కాటు వేసే ఆజ్ఞ ఇచ్చింది ఇకమీదట మోక్ష నీ మీద చెయ్యి వేస్తే కాటు వేసి చంపే అధికారం నాకు ఉంది అది గుర్తుపెట్టుకో పంచమి అని ఫణేంద్ర వెళ్ళిపోతాడు.

Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights
Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights

కట్ చేస్తే, నీలాంబరి నంబూద్రి ఆత్మను పిలిచి అన్నయ్య నిన్ను కాపాడడానికి మోక్షని వశం చేసుకోవడానికి వెళుతున్నాను కొన్నాళ్లు నీ దేహాన్ని కంత్రి తంత్రి పసర్లు ప్పుస్తూ కాపాడుతూ ఉంటారు నువ్వు నీ ఆత్మ దగ్గర ఉండి ఏ దుష్టశక్తులు దగ్గరికి రాకుండా చూసుకో అన్నయ్య అని అంటుంది. చూడు నీలాంబరి కొంతకాలం వరకే పసర్లు పూసిన నా దేహం ఉండగలుగుతుంది సమయం మించి పోతే నా దేహం శిధిలమైపోతుంది అప్పుడు నువ్వు నాగమణి నీ సంపాదించిన నన్ను బ్రతికించలేవు అని నంబూద్రి అంటాడు. నాకు తెలుసు అన్నయ్య అందుకే ఆ కార్యం మీదనే నేను వెళ్తున్నాను మోక్షాని వశం చేసుకొని పంచమిని మెడలు వంచి ఆ నాగమణి సంపాదించి నిన్ను బ్రతికించుకుంటాను అని నీలాంబరి అంటుంది.నాగమణి మన సొంతం అయితే ప్రపంచంలో మనని ఎదిరించే వాడు ఎవడు ఉండడు చెల్లెమ్మా నువ్వు త్వరగా ఆ నాగమణిని సంపాదించు నేను నా శరీరం దగ్గర రక్షణ కవచంలా ఉంటాను అని నంబూద్రి అంటాడు. నీలాంబరి ఒక శక్తిని ఆశ్రమాన్ని చూసుకోమని చెప్తుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights
Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights

మోక్ష వాళ్ళ ఇంటికి గుమ్మడికాయ కట్టించి పూజ చేయిస్తారు. అమ్మ ఒక నెలరోజుల దాకా ఈ గుమ్మడికాయ గుమ్మానికి ఉండనివ్వండి ఆ తరువాత నేను వచ్చి తీసి బజార్లో పగలగొడతాను అప్పుడు ఇంట్లో ఉన్న దిష్టి అంతా పోతుంది అని పంతులుగారు చెప్తాడు. అలాగే పంతులుగారు అని శబరి పంచమి పంతులు గారికి దక్షిణ తెచ్చి ఇవ్వు అని అంటుంది. పంచమి దక్షిణ ఇస్తుంది. పంతులుగారు వెళ్ళిపోతారు. నువ్వేమన్నా దానకర్ణుడికి చెల్లెలు అనుకుంటున్నావా కట్టలు కట్టలు దానం ఇచ్చేస్తున్నావ్ అని చిత్ర అంటుంది.

Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights
Naga Panchami Today Episode November 30 2023 Episode 214 Highlights

గుడిలో చిల్లర అడుక్కునే దానికి డబ్బుల విలువ ఏం తెలుస్తుంది చిత్రా అని జ్వాల అంటుంది. చూడండి పంచమి ఇంటికి కోడలు దానమిచ్చే హక్కు తనకు ఉంది అని రఘు వాళ్ళ చెల్లెలు అంటుంది. పాములు పట్టే దానికి పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది అక్క మనమే మన ఊరికే వచ్చామా కట్టలు తీసుకొని వచ్చాము అని చిత్ర అంటుంది. వీళ్ళతో మనకెందుకు పదండి వెళ్దాం రా నాన్న అని మోక్షను తీసుకొని వెళ్ళిపోతుంది శబరి. కట్నం గురించి మాట్లాడితే చాలు అందరూ నోరు మెదపకుండా వెళ్ళిపోతారు అని జ్వాల అంటుంది. కట్ చేస్తే, నీలాంబరి ఒక అందమైన రూపాన్ని ధరించి  సూట్ కేస్ పట్టుకొని మోక్ష వాళ్ళ ఇంటికి వస్తుంది..

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar