NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కరరెడ్డి .. తిరిగి చంచల్ గూడ జైల్ కు తరలింపు

CBI Notices to ys bhaskar reddy once again in viveka murder case

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టు ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగిసింది. దీంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్ విధించడంతో అధికారులు భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైల్ కు తరలించారు. అనారోగ్య కారణాలతో  వైఎస్ భాస్కరరెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 22వ తేదీన తొలుత 12 రోజులు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ వదిలివెళ్లకూడదని కండిషన్ పెట్టింది.

CBI Notices to ys bhaskar reddy once again in viveka murder case
ys bhaskar reddy,

ఎస్కార్ట్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న భాస్కరరెడ్డి వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నందున ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా రెండు మూడు పర్యాయాలు పిటిషన్లు దాఖలు చేయగా విచారణ జరిపిన సీబీఐ కోర్టు..ఎస్కార్ బెయిల్ పొడిగిస్తూ వచ్చింది. ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు పిటిషన్ పై గత నెలలో జరిగిన విచారణ సందర్భంలో సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఎస్కార్ట్ బెయిల్ గడువు ను సీబీఐ పొడిగించలేదు. దీంతో ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగియడంతో వైఎస్ భాస్కరరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 20 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్ విధించగా, సీబీఐ అధికారులు ఆయనను చంచల్ గూడ జైల్ కు తరలించారు.

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటే ఉన్నారు. వైఎస్ భాస్కరరెడ్డిని మాత్రం సీబీఐ అరెస్టు చేసి చంచల్ గూడ జైల్ కు తరలించింది. ఆయన పలు పర్యాయాలు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందారు భాస్కరరెడ్డి. సెప్టెంబర్ 22 నుండి నవంబర్ 30ద వరకూ వైఎస్ భాస్కరరెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పై ఉన్నారు.

KRMB: ఏపీ సర్కార్ కు కేఆర్ఎంబీ (కృష్ణాబోర్డు) కీలక ఆదేశాలు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N