Salaar: ప్రభాస్ కొత్త సినిమా “సలార్” డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతోంది. రిలీజ్ కి ఇంక వారమే ఉండటంతో బుక్ మై షో అప్లికేషన్ నీ ఓపెన్ చేయటంతో “సలార్” బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే.. ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టినట్లు వార్తలు వచ్చాయి. “సలార్” సినిమా భారీ ఓపెనింగ్స్… రావటం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “సలార్” సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో… చాలా వైలెన్స్ ఉన్నట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. దీంతో సెన్సార్ సభ్యులు సైతం “A” సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ తో చిన్నపిల్లలు సినిమా చూడటానికి వీలు లేకుండా పోయింది.
ప్రభాస్ “బాహుబలి” తర్వాత వరుస పరాజయాల బాటలో ఉన్నాడు. దీంతో “సలార్” పైనే ఎక్కువ ఆశలు పెట్టుకోవడం జరిగింది. పైగా “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ తీయడంతో కచ్చితంగా విజయం సాధిస్తుందని దీమాగా ఉన్నాడు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెద్దగా చేయటం లేదు. మరొకపక్క సరిగ్గా “సలార్” సినిమా విడుదలకి ఒక రోజు ముందు డిసెంబర్ 21వ తారీకు షారుక్ నటించిన “డంకీ” సినిమా విడుదల కాబోతోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఆల్రెడీ 2023 ఈ ఏడాదిలో షారుక్.. పఠాన్, జవాన్ సినిమాలతో విజయాలు సాధించడం జరిగింది.
రెండు సినిమాలు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. “డంకీ” సినిమాతో షారుక్ హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. దీంతో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా నెలకొంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు. దీంతో ఇప్పుడు ఓపెనింగ్స్ విషయంలో మాత్రం “సలార్” కంటే “డంకీ”.. పై చేయి.. సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.