Salaar: “సలార్” మొదటి భాగం డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతోంది. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసపరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ప్రమోషన్స్ ఆశించిన రీతిలో జరగటం లేదు. ఇప్పటివరకు కేవలం ఒక ట్రైలర్, ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మరోపక్క సినిమా విడుదలకు ఇంక వారం రోజులు కూడా సమయం లేదు. విడుదల చేసిన ట్రైలర్ లో కూడా మూడు నిమిషాల ఫుల్ రన్ టైం ఉంటే అందులో… చివరి నిమిషంలో మాత్రమే ప్రభాస్ కనిపించాడు.
దీంతో సినిమా విడుదలకి ముందు రెండో ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కటం జరిగింది. ఫ్రెండ్ కోసం ఏం చేయటానికైనా సిద్ధపడే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు. ప్రభాస్ స్నేహితుడిగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. మోస్ట్ వైలెంట్ సినిమాగా డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులకు హీరో నిఖిల్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం… వంద టికెట్లు ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. హైదరాబాద్ లో శ్రీరాములు థియేటర్ లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటిగంటకు “సలార్” షో పడుతుంది.
ఈ షోకి వందమంది డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫ్రీగా టికెట్స్ ఇస్తా. నేను కూడా వారితో కలిసి సినిమా చూస్తా..అని నిఖిల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నైజాం లో మైత్రి మూవీ మేకర్స్ సలార్ సినిమా రైట్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో మొదటి టికెట్ ఎస్ఎస్ రాజమౌళి ₹10,116 రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది. ప్రభాస్ విజయం సాధించాలని ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు కోరుకుంటున్నారు. అయితే ప్రమోషన్స్ మాత్రం ఆశించిన రీతిలో ఎక్కడ జరగకపోవడం పట్ల ఫ్యాన్స్ కొద్దిగా నిరుత్సాహం చెందుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ శృతిహాసన్.. హీరో ప్రభాస్ మరియు దర్శకుడితో ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.