NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Big Breaking: దావూద్ ఇబ్రహీంపై విఫప్రయోగం ..? కరాచీ ఆసుపత్రిలో చికిత్స..అసలు విషయం ఏమిటంటే..?

Big Breaking: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో పాకిస్థాన్ లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తొంది. దావూద్ ఇబ్రహీంకు విఫప్రయోగం జరగడం వల్ల అసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తను పాకిస్థాన్ మీడియా కూడా  ప్రసారం చేస్తొంది. భారీ భద్రత నడు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం పాకిస్థాన్ అధికారికంగా దృవీకరించలేదు. అక్కడి మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం దావూద్ ఇబ్రహం చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తొంది.

ముంబాయి పేలుళ్లలో సూత్రధాని అయిన భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్ లో తలదాచుకున్నాడు. 1993 లో ముంబాయిలో జరిగిన బాంబు దాడుల్లో 250 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలతో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లలో ఒకరిగా దావూద్ ఉన్నారు. అంతే కాకుండా 2008లో 26/11 ఉగ్రదాడుల సమయంలో పది మంది పాకిస్థానీ ఉగ్రవాదులకు దావూద్ ముంబాయిలో ఉన్న తన నెట్ వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్య్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్ చెబుతూ వస్తొంది. దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు ఆలీషా పార్కర్, సాజిద్ వాగ్లే నుండి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముంబాయి పోలీసులు. దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలోఉంటున్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఎన్ఐఏకి తెలియజేశాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో దావూద్ నిందితుడు. అతన్ని చంపితే 25 మిలియన్ డాలర్ల రివార్డును గతంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. నిషేదిత ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి.

Pawan Kalyan Chandrababu: పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు .. ఆ కీలక అంశాలపై చర్చ ..?

Related posts

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N