NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి మిగతా పద్మ పురస్కారాలు ఎంపికైన వారికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు..!!

Chiranjeevi Pawan Kalyan: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు వారైనా మెగాస్టార్ చిరంజీవికి అదేవిధంగా వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. దీంతో పద్మ అవార్డులు రావడం వల్ల మెగాస్టార్ చిరంజీవికి మిగతా వారికి అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేశారు. “భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు.

Pawan Kalyan congratulates Megastar Chiranjeevi for other Padma awards

కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు ‘పద్మ విభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన శ్రీ వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్దాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్చంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

Pawan Kalyan congratulates Megastar Chiranjeevi for other Padma awards

శ్రీ వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరం. మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమా మహేశ్వరి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళాకారుడు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీ వేలు ఆనందాచారి గారు, బుర్ర వీణ వాయిద్యకారుడు శ్రీ దాసరి కొండప్ప గారు, సాహిత్య విభాగం నుంచి శ్రీ కేతావత్ సోంలాల్ గారు, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందదాయకం. వారికి నా అభినందనలు. పద్మ పురస్కారాలకు ఎంపిక విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రశంసలు అందుకొంటోంది. సామాజిక సేవ, సాహిత్యం, వ్యవసాయం.. ఇలా వివిధ రంగాల్లో స్ఫూర్తిదాయకమైన సేవలు చేస్తూ అన్సంగ్ హీరోస్ గా ఉన్నవారిని గుర్తించి పద్మ అవార్డులతో గౌరవిస్తున్నారు. ఈ పురస్కారాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ అభినందనలు”..అని పేర్కొన్నారు.

Related posts

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N