Rajamouli: హాలీవుడ్ టాప్ ఫిలిం మేకర్ వరల్డ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవతార్ ఇంకా అనేక అద్భుతమైన సినిమాలు తీసి ప్రపంచంలోనే టాప్ మోస్ట్ దర్శకుడిగా పేరు సంపాదించారు. అటువంటి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలపై గతంలోనే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలలో RRR అద్భుతమైన సినిమా అని రాజమౌళితో కలసి పనిచేయాలని తనకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు బహిరంగంగానే మీడియా ముందు కామెంట్లు చేయడం జరిగింది. అయితే మరోసారి లేటెస్ట్ గా ఓ అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీకు ఎవరు స్ఫూర్తి మీరు ప్రపంచంలోనే టాప్ దర్శకుడిగా రాణించటానికి ఎవరు దోహదపడ్డారు అని ఓ యాంకర్ ప్రశ్నించారు.
దీనికి ఆయన బదిలిస్తూ నా కెరియర్ లో చాలామందిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తాను. స్టీఫెన్ స్పిల్ బర్గ్ వక్ చూసుకుంటే ప్రతిదీ చాలా కొత్తగానే ఉంటుంది. అలాగే కొత్త ఫిలిం మేకర్స్ తెరకెక్కించే సినిమాలు చూసినప్పుడు కూడా.. అటువంటి ఆలోచన నాకెందుకు రాలేదు అని బాధపడుతూ ఉంటాను. దీంతో నేను ఇంకొంచెం కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నాలు చేస్తాను. ఈ క్రమంలో ఎస్.ఎస్ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. RRR సినిమాని చాలా అద్భుతంగా ప్రపంచం మొత్తం ఇష్టపడేలా తెరకెక్కించారు. కళ్ళు చెదిరే విధంగా RRR తీశారు అనిపించింది. అందుకే రాజమౌళికి నా అభిప్రాయం నిజాయితీగా అప్పట్లో చెప్పడం జరిగింది. నిజంగా భారతీయ చలనచిత్ర రంగం అంతర్జాతీయ వేదిక పైకి దూసుకురావడం శుభ పరిణామం అని జేమ్స్ కామరూన్ కామెంట్లు చేశారు.
రాజమౌళి సినిమాల కారణంగా ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో దూసుకుపోయింది. RRR, బాహుబలి చిత్రాలకు హాలీవుడ్ టాప్ ఫిలిం మేకర్స్ ఫిదా అయ్యారు. చాలా తక్కువ బడ్జెట్ లోనే రాజమౌళి ఈ రకమైన సినిమాలు అందించడం చాలా గ్రేట్ అని కొంతమంది పొగడటం కూడా జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. మార్చి నెలలో సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన జరగనున్నట్లు సమాచారం.