NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema February 7 2024 Episode 540: విక్కీ ఇంటికి రమేష్ చంద్ర.. విక్కీ దగ్గర మాట తీసుకున్న పద్మావతి..

Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540 Highlights

Nuvvu Nenu Prema February 7 2024 Episode 540:  పద్మావతి ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. రమేష్ చంద్ర విక్కి వాళ్ళిద్దరిని ఎలా కలపాలి అని ఆలోచిస్తు ఉంటుంది. ముందు విక్కీలో ప్రేమ కలగాలి అప్పుడే వాళ్ళ నాన్న మీద గౌరవంతో కలవాలి అని అనుకుంటుంది. నాకు విక్కీ గారి మీద విపరీతమైన ప్రేమ ఉంది కానీ నా మీద ఆయనకు రవ్వంత ప్రేమ కూడా లేదు ఉండి ఉండుంటే ఈపాటికి వచ్చినన్ని తీసుకువెళ్లి వాళ్ళు కదా అని పద్మావతి మనసులో అనుకుంటుంది సరిగ్గా అదే సమయానికి విక్కి అక్కడికి వస్తాడు పద్మావతి మనసులో విక్కి ఇక్కడికి వచ్చారన్న ఆలోచన కలుగుతుంది ఇక గబగబా బయటికి వెళ్లి చూసేసరికి పద్మావతి ఎదురుగా విక్కి కనపడతాడు ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చారు. చాలా సంతోషం అని పద్మావతి అంటుంది సరే పద ఇక వెంటనే ఇంటికి వెళ్దాం అని విక్కీ అంటాడు కానీ పద్మావతి మాత్రం నేను రాను అనే చెబుతుంది

Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540  Highlights
Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540 Highlights

పద్మావతి ఎప్పుడూ నేనే నీ దగ్గరికి రావడం తప్ప నువ్వు ఎప్పుడు నాకోసం తగ్గడం లేదు అని విక్కీ అంటాడు నేను రానని చెబుతున్నాను కదా సార్ మీరు ఎక్కడి నుంచి వెళ్లిపోండి అని పద్మావతి అంటుంది ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తావు గాని నా పరిస్థితి గురించి నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించవు అక్కడ అక్క ఏమి తినకుండా ఉంది. నిన్ను తీసుకొని వస్తానే అక్క ఏమైనా తింటాను అని చెప్పింది. అక్కకి నేను పద్మావతిని తీసుకు వస్తాను అని మాట ఇచ్చాను అంటాడు. రేపు ఉదయం సూర్యోదయం కల్లా పద్మావతి నా కళ్ళ ముందు ఉండాలి లేదంటే సూర్యాస్తమయం కల అయ్యాక నీకు కనపడదు అని అంటుంది. అక్క సరదా కూడా అనొద్దకు అనే తట్టుకోలేను, కానీ తను నిజంగానే ఇలా చేస్తుంది అని అంటాడు. అక్కకి నిన్ను కచ్చితంగా ఉదయం కల్లా తీసుకొస్తాను అని మాట ఇచ్చాను నువ్వ రా పద్మావతి అని విక్కి అంటాడు. సరిగ్గా ఇదే సమయానికి పద్మావతి మనసులో రమేష్ చంద్ర తో పాటు తన కూతుర్ని ఎలాగైనా విక్కీ సార్ వాళ్ళింటికి తీసుకువెళ్లాలి అని అనుకుంటుంది. ఇదే సరైన సమయం అని విక్కికి తెలియకుండా ఎలాగైనా పద్మావతి మాట తీసుకోవాలని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540  Highlights
Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540 Highlights

అప్పుడు పద్మావతి తనకి ఒక మాట ఇవ్వమని అడుగుతుంది. నాతోపాటు ఆ ఇంటికి ఇంకో ఇద్దరు మనుషులు వస్తారు. వాళ్లు కూడా ఆ ఇంట్లో ఉండటానికి మీరు అనుమతి ఇస్తేనే నేను ఆ ఇంట్లోకి వస్తాను లేదంటే ఆ ఇంట్లోకి నేను రాను అని పద్మావతి చెబుతుంది. అప్పుడు విక్కీ మనసులో బహుశా వాళ్ళ అమ్మానాన్న ఇంటికి తెచ్చుకుంటుందేమోలే అని అనుకుంటాడు. సరే అని విక్కి పద్మావతి చేతిలో చెయ్యేసి మరి మాట ఇస్తాడు. పద్మావతి మనసులో ఏముందో తెలియకోకుండా పద్మావతికి మాట ఇచ్చేస్తాడుగా తీసుకున్న పద్మావతి ఎలాగైనా రమేష్ చంద్ర తో పాటు తన కూతుర్ని ఆ ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుంటుంది. అయితే నాతో పాటు నువ్వు వెంటనే బయలుదేరు అని పద్మావతిని విక్కి అడుగుతాడు. అప్పుడు పద్మావతి మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెబుతుంది. సరే అని విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. అప్పుడే పద్మావతి వాళ్ళ అమ్మ అల్లుడు గారు భోజనం చేసి వెళ్ళండి అని అంటే ఎప్పుడు కాదు అత్తయ్య అక్కడ వేరే పనిలో ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు భోజనం చేస్తాను అని విక్కి అక్కడ నుంచి బయలుదేరుతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540  Highlights
Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540 Highlights

అమ్మ పద్మావతి నువ్వు ఏ ఉద్దేశం పెట్టుకుని అల్లుడు గారి దగ్గర మాట తీసుకున్నావో నాకు తెలుసు అని వాళ్ళ నాన్న పద్మావతిని అడుగుతాడు. అవును నాన్నగారు మావయ్య గారిని ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్లాలని అనుకున్నాను. మామయ్య ఈ ఆఖరి క్షణాల్లో వాళ్ళ పిల్లలతో పాటు కలిసి ఉండాలని ఎంతో ఆశపడుతున్నారు. ఆయన కోడలిగా నేను ఈ బాధ్యతని నిర్వర్తించాలని అనుకుంటున్నాను అని పద్మావతి అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నీకు అనవసరంగా కష్టాలు వస్తాయి పద్మావతి అని చెబుతుంది.
మన బిడ్డ ఏం చేసినా ముందు వెనక ఆలోచించే చేస్తుంది. ఇలాంటి సమయంలో మనం తనకి సపోర్ట్ గా ఉండాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు పార్వతి అని పద్మావతికి సపోర్ట్ గా మాట్లాడుతాడు వాళ్ళ నాన్న.

Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540  Highlights
Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540 Highlights

మరోవైపు విక్కీ వాళ్ళ ఇంట్లో శాంతి పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. అరవింద దగ్గరుండి వాళ్ళ అమ్మ శాంతి పూజకు కావలసిన అన్ని పనులను తనే దగ్గరుండి చేస్తూ ఉంటుంది. అప్పుడే కుచల అందంగా రెడీ అయి వస్తే తన భర్త ప్రసాద్ తనని అరుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడికి ఎలా రెడీ అయ్యి రావాలో నీకు తెలియదా ఇక్కడ జరుగుతుంది శాంతి పూజ అని ఆయన చెబుతాడు. అంటే పూజే కదా పూజకు అందంగా రెడీ అవ్వచ్చు కదా అని అమాయకంగా అంటుంది. అయినా నేను అందంగా ఉన్నానని మీకు కుళ్ళు కదా అని అంటుంది. పోనీలే బాబాయ్ పిన్ని రెడీ అవుతాయి ఇందులో అవ్వనివ్వండి అని అరవింద అంటుంది. అప్పుడే కృష్ణ అక్కడికి వచ్చి ఏంటి రాణమ్మ మొన్నే కదా మీ అమ్మకి ఆబ్దికం నిర్వహించాము. ఇప్పుడు మళ్లీ ఈ శాంతి పూజ ఎందుకు అని అడగగా ఆ రోజు కొన్ని దుష్ట శక్తులు అమ్మకి సరిగ్గా తరపనం పెట్టనివ్వలేదు. అందుకే ఈ పూజ చేయిస్తున్నాము అని అరవింద చెబుతుంది. ఇక విక్కీ కూడా అక్కడికి వస్తాడు పద్మావతి రావటానికి ఒప్పుకుంది అని అరవింద్ కి చెబుతాడు. అయితే నువ్వు త్వరగా వెళ్లి రెడీ అయ్యి రమ్మని అరవిందా చెబుతుంది.

Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540  Highlights
Nuvvu Nenu Prema Today Episode February 7 2024 Episode 540 Highlights

మరోవైపు రమేష్ చంద్ర అరవింద వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు. అరవింద కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎంతసేపు మాట్లాడిన అటువైపు నుంచి ఎవరి గొంతు వినిపించదు. ఎవరండీ మీరు ఫోన్ చేసి మాట్లాడరు అని అరవింద అడుగుతుంది. అప్పుడు నేను అమ్మ మీ నాన్నని అని రమేష్ చంద్ర అంటాడు. ఒక్కసారి నన్ను నాన్న అని పిలువమ్మ అని రమేష్ చంద్ర ఆప్యాయంగా అరవింద్ అని అడుగుతాడు. కానీ అరవింద కోపంతో రాంగ్ నెంబర్ అని పెట్టేస్తుంది . మా అమ్మని చంపేసిన హంతకుడితో నేను ఎప్పుడూ మాట్లాడను అని అరవింద మనసులో అనుకుంటుంది.

రమేష్ చంద్ర వాళ్ల ఇంటికి పద్మావతి వెళ్తుంది. మావయ్య గారు ఎలాగైనా మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకువెళ్లాలని నేను ఎక్కడికి వచ్చాను అని పద్మావతి చెబుతుంది. అప్పుడు నీకు ఎందుకమ్మా ఈ శ్రమ అని అంటే ఈ కోడలిగా ఆ బాధ్యత నాది మావయ్య గారు మీరు మీ పిల్లలతో సంతోషంగా ఉండాలి అని అంటుంది. అప్పుడే రమేష్ చంద్ర వాళ్ల కూతురు వచ్చి నువ్వు ఎన్ని రోజుల నుంచి మా నాన్న దగ్గరికి వస్తుంది. లేనిపోని ఆశలు కల్పిస్తున్నావా అని పద్మావతిని తిడుతుంది. తను ఎవరు అనుకుంటున్నావు మీ అన్నయ్య విక్కీ భార్య అని రమేష్ చంద్ర తనకి చెబుతాడు. ఇక వాళ్ళిద్దర్నీ ఒప్పించి విక్కీ వాళ్ళింటికి తీసుకు వెళ్ళడానికి పద్మావతి కారులో బయలుదేరుతారు. ఇక అక్కడ ఏం జరుగుతుందో అని అందరూ కంగారుపడుతూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి రమేష్ చంద్ర తన కూతుర్ని తీసుకొని విక్కీ వాళ్ళింటికి బయలుదేరుతుంది. మరోవైపు విక్కి వాళ్ళ అమ్మకి శాంతి పూజ నిర్వహిస్తూ ఉంటాడు. ఇక పూజ ముగిసిపోయే సమయానికి సరిగ్గా అక్కడికి పద్మావతి తో పాటు రమేష్ చంద్ర తన కూతురు ఇద్దరు వస్తాడు. ఇక రమేష్ చంద్ర ఇంట్లోకి కాలు పెట్టబోతుండగా మీరు అక్కడే ఆగండి. ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు తెలిసి తెలిసి మా అమ్మని చంపిన వాడిని ఇంట్లోకి ఎలా తీసుకొస్తావని పద్మావతిని విక్కీ ప్రశ్నిస్తాడు. ఇందాక నేను ఇంట్లోకి రావటానికి ఇద్దరినీ ఈ ఇంటికి తీసుకువస్తాను అని మాట తీసుకున్నాను. ఆ ఇద్దరూ వీళ్లే అనే పద్మావతి చెబితే వికీ వాళ్లని ఇంట్లోకి రావడానికి ఊరుకుంటాడా.. లేదంటే వాళ్లతో పాటే పద్మావతిని కూడా బయటకు పంపించేస్తాడా అనేది చూడాలి.

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N