Samantha: స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది “ఖుషి” సినిమాతో హిట్ అందుకోవడం తెలిసిందే. ఈ సినిమా రాకముందు వరుస పరాజయాలతో పాటు మయోసైటీస్ వ్యాధి బారిన పడి కెరియర్ పరంగా వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి సమయంలో ఖుషి విజయం సమంతాకి మంచి రిలీఫ్ ఇవ్వటం జరిగింది. అనంతరం విదేశాలకు వెళ్ళిపోయిన సమంత అక్కడ రెండు నెలలపాటు రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఖుషి విజయం తర్వాత సమంత మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో అనేక విషయాలు పంచుకునేది. ఇదే సమయంలో సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించినట్లు ప్రకటించడం జరిగింది.
దీంతో సమంత సినిమాలకు దూరమైపోయింది అని అభిమానులు తెగ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో తాజాగా ఇప్పుడు సమంత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా కన్ఫామ్ కావటం జరిగిందట. సమంత మాత్రమే కాదు దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ కూడా నటిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆల్రెడీ సమంత గతంలో రామ్ చరణ్ తో *రంగస్థలం” సినిమా చేయడం తెలిసిందే. 2018లో వచ్చిన “రంగస్థలం” సూపర్ డూపర్ హిట్ అయింది. నటుడిగా రామ్ చరణ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చరణ్ సినిమాలో సమంత అవకాశమందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అథ్లెటిక్ స్టోరీతో పాన్ ఇండియా నేపథ్యంలో బుచ్చిబాబు ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ కి అన్నయ్యగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కనిపించనున్నారని సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!