Nani Sandeep Reddy Vanga: భారతీయ చలనచిత్ర రంగంలో టాలీవుడ్ ఇండస్ట్రీస్ స్థాయి రోజు రోజుకి పెరుగుతుంది. తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన హీరోలు మరియు దర్శకులు చేస్తున్న సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఈ విషయంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక శిఖరంగా మారారు. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి”, “RRR” సినిమాలు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో తెలుగోడి టాలెంట్ ఏంటో నిరూపించాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ప్రపంచ సినిమా రంగానికి చెందిన అనేకమంది రాజమౌళితో కలిసి పనిచేయడానికి ఆరాటపడుతున్నారు.
ఇక ఇదే విధంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా సత్తా చాటుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన తీసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కెరియర్ ప్రారంభించి ఒక్క పరాజయం లేని దర్శకుడిగా నిలిచారు. ఈ మూడింటిలో రెండు బాలీవుడ్ లో తీసినవే. గత ఏడాది తీసిన “యానిమల్” ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అటువంటి దర్శకుడు సందీప్ రెడ్డికి అదేవిధంగా న్యాచురల్ స్టార్ హీరో నానికి అవార్డులు వచ్చాయి. పూర్తి విషయంలోకి వెళ్తే చెన్నైలో జరిగిన ‘బిహైండ్ వుడ్స్ హాల్ ఆఫ్ ఫేమర్స్’ కార్యక్రమంలో హీరో నాని బెస్ట్ హీరో అవార్డు అందుకున్నారు. “హాయ్ నాన్న” మూవీకి గానూ ఆయనకు ఈ పురస్కారం వరించింది.
‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. మరోవైపు “హాయ్ నాన్న”తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శౌర్యువ్ ఉత్తమ్ డెబ్యూ డైరెక్టర్ గా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. తండ్రి కూతురు నేపథ్యంలో ఎమోషనల్ రొమాంటిక్ స్టోరీగా వచ్చిన “హాయ్ నాన్న” క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మరో విజయానీ.. నాని గత ఏడాది తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో ‘బిహైండ్ వుడ్స్ హాల్ ఆఫ్ ఫేమర్స్’ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది.