NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

యువ‌రాజ్ సింగ్‌కు బీజేపీ ఎంపీ టిక్కెట్‌… ఆ హీరోను బ‌య‌ట‌కు పంపేసిందిగా..!

వచ్చే ఎన్నికల్లోను వరుసగా మూడోసారి విజయం సాధించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి పావులు కదుపుతోంది. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. పంజాబ్లో బిజెపికి పెద్దగా బలం లేకపోయినా.. అక్కడ సినిమా హీరోలు, క్రికెటర్లను అడ్డం పెట్టుకుని ఒకటి రెండు ఎంపీ సీట్లలో అయినా సత్తా చాటుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా శిరోమణి అకాళీద‌ళ్‌లతో స్నేహం చెడిన తర్వాత కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరేందర్ సింగ్ లాంటి వాళ్ళను తెచ్చుకున్న బిజెపికి పంజాబ్లో పెద్దగా బలం రాలేదు.

గత ఎన్నికలలో గురుదాస్‌పూర్ నుంచి బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీడియోల్‌ను రంగంలోకి దింపగా ఆయన మంచి మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఐదేళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. ఆయన గెలిచిన దగ్గరనుంచి ఎంపీ హోదా అంటే అదో గౌరవం మాత్రమే అన్నట్టుగా వ్యవహరించారట. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా కూడా రాలేదు. దీనికి తోడు చాలా రోజుల తర్వాత ఆయన నటించిన గద‌ర్ 2 సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆయన ఇప్పుడు తిరిగే సినిమా కెరియర్ లో బిజీ అయ్యారు. ఇప్పుడు ఎలాగైనా పంజాబ్లో పార్టీకి మంచి ఊపు తెచ్చేందుకు గురుదాస్‌పూర్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేందుకు బిజెపి సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

సన్నీ డియోల్ కు ఆప్షన్ గా టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను బిజెపి లైన్ లో పెడుతుందని సమాచారం. సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్పూర్ నుంచి యువరాజ్ సింగ్‌ను పోటీ చేయించేందుకు బిజెపి హై కమాండ్ పావులు కదుపుతోందని తెలుస్తోంది. బిజెపి వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనకు యువరాజ్ సింగ్ కూడా సానుకూలత వ్యక్తం చేశారని.. యువరాజును పార్టీలో చేర్చుకుని ఎంపీగా పోటీ చేయిస్తే బలమైన అభ్యర్థిగా రంగంలో ఉండడంతో పాటు ఆ ప్రభావం పంజాబ్, హర్యానా, ఢిల్లీలో బిజెపికి బాగా ప్లస్ అవుతుందని బిజెపి ఢిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నారట.

ఇందుకు సంబంధించి ఇప్పటికే యువరాజ్ సింగ్ తల్లి బిజెపి హైక‌మాండ్ మధ్య చర్చలు జరిగాయని అధికారికంగా దీనిని బయటకు వెల్లడించకపోయినా.. త్వరలోనే యువరాజ్ సింగ్ కాషాయ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున గురుదాస్‌ఫూర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ఏదేమైనా బీజేపీ ప్ర‌తి ఎన్నిక‌కు సినిమా వాళ్ల ఛ‌రిష్మానో లేదా క్రికెట‌ర్ల‌ను బాగా వాడుకుని ల‌బ్ధి పొందుతూ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో సినిమా వాళ్లు ర‌వికిష‌న్ సింగ్, మ‌నోజ్ తివారి, క్రికెట‌ర్ గంబీర్‌ల‌ను పార్ల‌మెంటుకు పోటీ చేయించి గెలిపించింది. సౌత్‌లో మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త‌కు మండ్య‌లో స‌పోర్ట్ చేసి గెలిపించింది. ఇప్పుడు యువ‌రాజ్‌కు గురి పెట్టింది.

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?