NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ క‌మ్మ‌లు వ‌ర్సెస్ వైసీపీ బీసీలు… ఎవ‌రి స్ట్రాట‌జీ ఏంటి…!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లను అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అభ్య‌ర్థుల‌ను పోటాపోటీగా నిల‌బెడుతున్నారు. ముఖ్యంగా వైసీపీని తీసుకుంటే.. కీల‌క‌మైన ప్ర‌యోగానికి తెర‌దీసింది. బీసీల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని చెబుతూ.. చాలా వ‌ర కు నియోజ‌క‌వ‌ర్గాల్లో బీసీల‌ను స‌మ‌న్వ‌య క‌ర్తలుగా వైసీపీ అవ‌కాశం ఇచ్చింది. వీరు.. ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతార‌ని కూడా భావిస్తున్నారు.

వైసీపీ చేసిన ప్ర‌యోగాల‌ను గ‌మ‌నిస్తే.. ఓసీ స్థానాల‌ను కూడా బీసీల‌కు కేటాయించింది. ఉదాహ‌ర‌ణ‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ రెడ్డి నాయ‌కుడు ఆళ్ల గెలుస్తున్నారు. ఈ ద‌ఫా ఇక్క‌డ బీసీ మంత్రం ప‌ఠించింది వైసీపీ. దీంతో అవ‌స‌ర‌మైతే.. కొన్ని త్యాగాల‌కు కూడా సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అనుస‌రించే వ్యూహంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎలాంటి వ్యూహంతో ఈ పార్టీ ముందుకు సాగుతుంది? అని అందరూ అనుకున్నారు.

అయితే.. బీసీల‌ను వైసీపీ నిల‌బెట్టిన నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ పోటా పోటీగా ఎందుకో.. బీసీల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేక పోయింది. దీనికి కార‌ణాలు ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓసీ వ‌ర్సెస్ బీసీల‌కు మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌నుంది. మ‌రి ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది ? అనేది ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు ఎలా ? ఉంటుంద‌నేది చూడా అంచ‌నా వేయాలి.

ఉదాహ‌ర‌ణ‌కు .. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తీసుకుంటే.. ఇక్క‌డ ఉన్న ఓసీ అభ్య‌ర్థిని ప‌క్క‌కు త‌ప్పించి మ‌రీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్.. బీసీ కేండెట్‌కు టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీంతో భ‌గ్గున సెగ‌లు వ‌చ్చినా.. చ‌ల్లార్చుకుని.. మ‌రీ పోరుకు రెడీ అయ్యారు. టికెట్ ఎవ‌రికి ఇచ్చినా.. బీసీ ఖాయం. ఇక‌, టీడీపీని చూస్తే.. ఓసీ అభ్య‌ర్థి నారా లోకేష్‌కే మ‌రోసారి టికెట్ ఇచ్చారు. సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్ ప్ర‌కారం జ‌నం ఓట్లేస్తే.. ఇక్క‌డ పోలింగ్ ఉత్కంఠ‌గానే మార‌నుంది.

మ‌రో నియోజ‌క‌వ‌ర్గం క‌ళ్యాణదుర్గం. ఇక్క‌డ కూడా.. వైసీపీ ప్ర‌యోగానికి రెడీ అయింది. ఇక్క‌డ ఆల్రెడీ బీసీ నాయ‌కురాలు.. కురబ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉష‌శ్రీచ‌ర‌ణ్ ఉన్నారు. అయితే.. ఆమెను త‌ప్పించినా.. మ‌రోసారి బీసీకే వైసీపీ ప్రాధాన్యం ఇచ్చింది. ఎంపీ త‌లారి రంగ‌య్య‌కు ఈ టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంది. ఈయ‌నను ప్ర‌స్తుతం ఇంచార్జిగా నియ‌మించారు. ఇక‌, టీడీపీ నుంచి చూస్తే.. క‌మ్మ వ‌ర్గానికి చెందిన అమిలినేని సురేంద్ర‌బాబుకు ఇచ్చారు. అంటే.. ఇక్క‌డ కూడా ఓసీ వ‌ర్సెస్ బీసీల మ‌ధ్య పోరు సాగ‌నుంది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు ఇంకా ఉన్నాయి.

Related posts

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?