NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

24 – 5.. ఈ లెక్క న‌చ్చ‌క‌పోయినా ఆ కార‌ణంతోనే జ‌న‌సేన స‌ర్దుకుపోతోందా…!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌క‌టించిన సీట్ల వ్య‌వ‌హారం.. ఆసక్తిగా మారింది. మొత్తం 175 స్థానాల్లో జ‌న‌సేన‌కు 24 సీట్లు, టీడీపీ కి 94 స్థానాల‌ను కేటాయించిన‌ట్టు స్వ‌యంగా చంద్ర‌బాబు చెప్పారు. ఇక‌, బీజేపీ కోస‌మ‌ని 57 స్తానాల‌ను అట్టేపెట్టామ‌న్నారు. ఇక‌, ఈ స‌మ‌యంలోనే 94 స్థానాల‌కు టీడీపీ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించారు.

అయితే.. 24 అసెంబ్లీ స్థానాలు ప్ర‌క‌టించుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం.. కేవ‌లం 5 స్థానాల్లోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించుకున్నారు. తెనాలి-నాదెండ్ల మ‌నోహ‌ర్‌, నెల్లిమ‌ర్ల‌-లోకం మాధ‌వి, రాజా న‌గ‌రం-బ‌త్తుల బ‌ల‌రామ‌కృష్ణ‌, అన‌కాప‌ల్లి-కొణ‌తాల రామ‌కృష్ణ‌, కాకినాడ రూర‌ల్ – పంతం నానాజీల‌ను మాత్ర‌మే ప్ర‌క‌టించారు. మిగిలిన వారి పేర్ల‌ను ప్ర‌క‌టించ‌లేదు. వాస్తవానికి ఇప్ప‌టికే 20 స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖ‌రార‌య్యార‌ని అంత‌ర్గ‌త స‌మాచారం.

అయితే.. ఇప్పుడు 5 స్థానాల‌కే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం.. కేవ‌లం 24 స్థానాల‌నే జ‌న‌సేన కోరుకోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ అయితే సాగుతోంది. దీనికి కొంద‌రు లాజిక్‌ను విశ్లేషిస్తున్నారు. 5 మంది అభ్య‌ర్థుల‌నే ప్ర‌క‌టించ‌డం వెనుక‌.. ఐదు సంఖ్య ప‌వ‌న్‌కు క‌లిసి వ‌చ్చిన అదృష్ట‌సంఖ్య అని .. ఆయ‌న ఏం చేసినా.. ఐదుతో ప్రారంభిస్తార‌ని.. అది ఆయ‌న‌కు విజ‌యాలు అందిస్తుంద‌ని అందుకే.. ఇలా ఐదును ఎంపిక చేసుకున్నార‌నే క‌థ‌నాన్ని కొంద‌రు చెబుతున్నారు. ఇది లాజిక్‌కు అంద‌క‌పోయినా స‌ర్దుకు పోతున్నారు.

ఇక‌, 24 స్థానాల‌నే ఎంపిక చేసుకోవ‌డం వెనుక‌.. ఫిబ్ర‌వ‌రి 24న ప్ర‌క‌టించ‌డం.. 2024 సంవ‌త్స‌రం కావ‌డంతో.. 2024-24 మొత్తంగా రెండు 24లు క‌లిసి రావ‌డంతో 24 సీట్ల‌నే ఎంపిక చేసుకున్నార‌నే చ‌ర్చ మ‌రోవైపు సాగుతోంది అయితే.దీనిపై అనేక స‌టైర్లు వ‌స్తున్నాయి. మార్చి 1న ప్ర‌క‌టించి ఉంటే.. 1 సీటును మాత్ర‌మే కోరేవారా? అని కొంద‌రు స‌టైర్లువేస్తున్నారు. ఇక‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఆర్జీవీ చేసిన కామెంట్లు అంద‌రికీ తెలిసిన‌వే.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?