NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టిక్కెట్ల ఎంపిక‌లో చంద్ర‌బాబును భ‌య‌పెట్టిన 3 రీజ‌న్లు ఇవే…!

టీడీపీ స‌హా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌.. చంద్ర‌బాబు సాహ‌సాలు చేయ‌లేక పోయారు అని! నిజ‌మే.. 175 స్థానాల్లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన 94 అసెంబ్లీ సీట్ల‌ను గ‌మ‌నిస్తే.. భారీ స్థాయిలో చేసిన మార్పులు పైకి ఏమీ క‌నిపించ‌డం లేదు. కానీ, మార్పులు జ‌రిగాయి. 24 స్థానాల్లో మాత్ర‌మే కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. మిగిలిన వాటిని పాత నేత‌నేత‌ల‌తోనే నింపేశారు. దీనిని గ‌మనించిన వారే.. చంద్ర‌బాబు సాహ‌సాలు చేయ‌లేక పోయార‌నే వాద‌న వినిపిస్తున్నారు.

కావొచ్చు.. చంద్ర‌బాబు సాహ‌సం చేయ‌లేక పోయి ఉండొచ్చు. వైసీపీ మాదిరిగా ఇష్టానుసారంగా.. నియోజ క‌వ‌ర్గాల నుంచి నాయ‌కుల‌ను బ‌దిలీ చేయ‌లేదు. ఎక్క‌డ బ‌డితే.. అక్క‌డ నాయ‌కుల‌ను తీసుకువ‌చ్చి.. స్థానికంగా ఆశ‌లు పెట్టుకున్న మెజారిటీ నాయ‌కుల‌కు ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌చ్చు. కేవ‌లం త‌న గెలుపును మాత్ర‌మే అంచ‌నా వేసుకున్న వైసీపీ మాదిరిగా చంద్ర‌బాబు చేయ‌లే కోవ‌చ్చు. అయితే.. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం.. టికెట్ల కేటాయింపును చూస్తే.. దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

1) పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు:
అభ్య‌ర్థుల‌ను మార్చిన చోట‌, లేదా బ‌దిలీ చేసిన చోట వైసీపీ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎదుర్కొంటూనే ఉంది. నాయ‌కులు స‌హ‌క‌రించ‌డం కూడా లేదు. దీంతో స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా ఉన్న‌వారు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను త‌రలించి ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇది పార్టీకి ఇబ్బందిగా మార‌నుంది. ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కుండా.. పార్టీని సాఫీగా ముందుకు న‌డిపించాల‌ని చంద్ర‌బాబు భావించారు.

2) సానుభూతి:
వైసీపీ అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం ద్వారా.. అవినీతి , అక్ర‌మాల వంటివాటిని తుడిచేసుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, ప్ర‌స్తుత టీడీపీ నేత‌ల‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు లేవు. సో.. వారిని మార్చాల్సిన అవ‌స‌రం లేదు. పైగా.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌నే సానుభూతి ఉంటుంది. దీనిని కాపాడుకునేందుకు ఓట్లుగా మ‌లుచుకునేందుకు వారికే టికెట్ ఇవ్వాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు ముందుకు క‌దిలారు.

3) అనుభవం:
రాష్ట్రానికి అనుభ‌వం ఉన్న నాయ‌కుడు అవ‌స‌ర‌మ‌ని.. అప్పుడే.. విభ‌జిత రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గ‌ల్లోనూ అనుభ‌వం ఉన్న నేత‌ల‌కే పెద్ద పీట వేశారు. కేవ‌లం పైస్థాయిలో అనుభ‌వం ఉన్న త‌న‌ను నిల‌బెట్టుకుని.. క్షేత్ర‌స్థాయిలో అనుభ‌వం లేని వారికి టికెట్ ఇస్తే.. రాజ‌కీయంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న ప్ర‌యోగాలు, సాహ‌సాల జోలికి పెద్ద‌గా పోలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N