NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 12 2024 Episode 176: సిరి గురించి తెలుసుకున్న జగదాత్రి తనని కాపాడుతుందా లేదా?..

Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights

Jagadhatri March 12 2024 Episode 176:  మీ నాన్నకి సిరి గురించి ఫోన్ చేసి చెప్పాను వాడు సిరి నీ రెండు రోజులు కాలేజీకి పంపించకు ఏమన్నా గొడవలు అయ్యా ఏమో సర్దుకుంటాయి అని చెప్పాడు కానీ సిరి వెళ్ళింది కానీ తిరిగి రాలేదు నాకెందుకో భయంగా ఉంది అని సుబ్బు అంటుంది.సుబ్బు ఆ విషయం మాకు చెప్పావు కదా మేము చూసుకుంటాంలే అని జగదాత్రి కేదార్ వెళ్తారు.దేవుడా సిరికి ఏమీ కాకుండా చూసుకో తను క్షేమంగా ఇంటికి వచ్చేలా చేయి అని సుబ్బు అనుకుంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights
Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights

కేదార్ ఫ్రెండ్స్ అందరినీ అడిగాము కాలేజీ కూడా వెళ్లి వెతికాము సిరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని జగదాత్రి అంటుంది.వాళ్లు అలా సిరిని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా సిరి ఫ్రెండ్ కావ్య వాళ్లని చూసి అక్క అని పిలుస్తుంది.నువ్వు సిరిఫ్రెండ్ కదా సిరి కాలేజీకి వచ్చిందా అని అడుగుతుంది జగదాత్రి.ఈరోజు అయితే కాలేజీకి రాలేదక్కా కానీ తను ఎందుకు వారం రోజులుగా డల్ గా ఉంటుంది ఏం మాట్లాడినా మాట్లాడడం లేదు ఈరోజు కాలేజీ కూడా రాలేదు అని కావ్య చెబుతుంది.ఈరోజు కాలేజీకి రాలేదంటే తాను రెగ్యులర్ గా ఎక్కడ ఉంటుందో నీకేమైనా తెలుసా అని కేదార్ అడుగుతాడు.సిరి క్వారీ సైడు వెళుతూ ఉండగా ఫ్రెండ్స్ చూశారంట నాకు చెప్పారు పిలిచినా పలకలేదంట అని కావ్య చెబుతుంది.సరే కావ్య తన గురించి చెప్పినందుకు థాంక్స్ అని జగదాత్రి కేదర్ వెళ్ళిపోతారు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights
Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights

జగదాత్రి కేదార్ క్వారీ దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉంటారు.సిరి మాత్రం ఒక బండమీదికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి నిలబడి చూస్తుంది.కేదార్ ఎంత వెతికినా సిరి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని జగదాత్రి చూడగానే ఒక కొండమీద కనబడుతుంది.అక్కడికి వెళ్లి జగదాత్రి సిరి చెంప మీద ఒకటి ఇస్తుంది .అక్క నేను చచ్చిపోతాను నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావ్ అని సిరి అంటుంది.జగదాత్రి ఇంకా కొట్టకు అని కేదార్ అంటాడు.చచ్చిపోతుంది అంట కేదార్ నీకు చావలసిన అంత కర్మ ఏమొచ్చింది ఏ కష్టం వచ్చినా ఈ అక్కకు చెప్పుకోవాలనిపించలేదా ఎందుకే ఇలాంటి పిచ్చి పని చేయాలనుకున్నావ్ అమ్మా నాన్నని నన్ను వదిలిపెట్టి చద్దామనుకున్నావా అని జగదాత్రి అంటుంది.నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పు సిరి మేం చూసుకుంటాం అని కేదార్ అంటాడు. ఏదో బలమైన కారణం ఉంటే కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకో సిరి అదేంటో చెప్పు అని జగదాత్రి అంటుంది. అక్క నా ఫ్రెండ్ డబ్బులు అవసరం ఉన్నాయని  అంటే ఫోన్లో ఆన్లైన్లోనూ తీసుకున్నాను లోను తీసుకున్నాక నా ఫ్రెండు కట్టడం మానేసింది వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అందుకే చచ్చిపోదామనుకున్నాను అని సిరి అంటుంది.

Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights
Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights

లోన్ ఎంత తీసుకున్నావ్ సిరి అని కేదార్ అంటాడు.రెండు లక్షలు మా ఫ్రెండ్ తీసుకుంది అని సిరి చెబుతుంది. నీ ప్రాణం విలువ రెండు లక్షలు అనుకున్నావా సిరి హాస్పిటల్ లో ప్రతి క్షణం ప్రాణం కోసం పోరాడే వాళ్లను అడుగు ప్రాణం విలువ తెలుస్తుంది రెండు లక్షలు అడిగితే మీ అక్క అయినా మీ నాన్న కట్టనన్నారా పద వెళ్లి లోన్ కట్టేద్దాం అని కేదార్ అంటాడు. సిరి రెండు లక్షల లోను కోసం నువ్వు చస్తావని నేను అనుకోవట్లేదు ఏదో బలమైన కారణం ఉంటే కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవు అదేంటో చెప్పు అని జగదాత్రి అడుగుతుంది. మా ఫ్రెండు లోను కట్టకపోవడంతో వాళ్ళు నాకు ఫోన్ చేయడం మొదలు పెట్టారు అక్క మా ఫ్రెండ్ తీసుకుంది నేను తీసుకోలేదు అని చెప్పిన వాళ్ళు వినిపించుకోకుండా నువ్వు రెండు లక్షల కి నాలుగు లక్షలు కట్టు లేకపోతే సోషల్ మీడియాలో నీ ఫోటోలు పెడతామని బెదిరిస్తున్నారు నేను బ్రతికి ఉండి ప్రయోజనం ఏంటి అక్క మీ అందరి పరువు తీయకూడదని నేను చావాలనుకున్నాను అని సిరి చెబుతుంది. సిరి ఈ విషయం నాకు చెప్పావు కదా నేను చూసుకుంటాను రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళు ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం పద అని జగదాత్రి సిరి నీ తీసుకొని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights
Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights

జెడి ఈ సమస్య నీ చెల్లెలికి ఒక్కదానికి వచ్చిందే కాదు చాలామందికి ఇలా జరుగుతూ ఉన్నాయి మొన్ననే హైదరాబాదులో ఒక కుటుంబం కొడుకు ఫీజు కోసమని లోను తీసుకున్నారు అది కట్టకపోవడంతో వాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు వీళ్లంతా అవసరం కోసం లోను తీసుకుంటున్నారు కానీ సమాజం ఏమనుకుంటుందో అని భయపడుతూ ఉంటారు అని వాళ్ళ సార్ అంటాడు. సార్ సిరి చెప్పింది విని ఆ కాల్ రికార్డింగ్ చూస్తే అంత ఆన్లైన్లో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఆ లొకేషన్ ఆంధ్రలోని ఒక చిన్న మారుమూల గ్రామంలో కనపడుతుంది అని జగదాత్రికి చెబుతుంది. జెడి దాదాపుగా ఇలాంటి 10 కేసుల్లో అంత వైజాగ్ విజయవాడ లోనే జరుగుతున్నట్టు తెలుస్తుంది ఈ ప్రాబ్లం ని ఎలాగైనా మీరే సాల్వ్ చేయాలి అని వాళ్ల సార్ అంటాడు.  ఈ ప్రాబ్లమ్స్ ని రెండు రోజుల్లో సాల్వ్ చేస్తాను వాడు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను ఇంకొకరు ఇలా వాళ్ల బారిన పడి చనిపోకుండా చూసుకుంటాను అని జగదాత్రి అంటుంది. పక్కనే ఉన్న మిగతా ఆఫీస్ సర్లకి ఆ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సిరి మాట్లాడిన రికార్డు అంతా విని అందులో ఏమైనా క్లూ దొరుకుతుందేమో నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights
Jagadhatri Today Episode March 12 2024 Episode 176 highlights

కీర్తి ఫోన్ పట్టుకుని ఫోటోలు దిగుతూ ఉంటుంది. ఇంతలో జగదాత్రి కేదార్ ఇంటికి వస్తారు. మిమ్మల్ని ఇద్దరినీ ఫోటో దించుతాను దగ్గర నిలబడండి అని కీర్తి చెబుతుంది. కేదారి జగదాత్రి దూరంగా నిలబడితే దగ్గరగా నిలబడండి అని సైగ చేసి చెబుతుంది కీర్తి. వాళ్ళిద్దరూ దగ్గరగా నిలబడ్డ తర్వాత ఆ ఫోటో తీస్తుంది కీర్తి.

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella