NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా నాలుగు సార్లు గెలుపు గుర్రం ఎక్కుతున్న కొడాలి నాని.. త‌న‌కు తిరుగులేద‌నే విధంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. అంతేకాదు.. సాధార‌ణంగా ఏ నాయ‌కుడైనా త‌న చేత‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతారు. కానీ, నాని విష‌యం డిఫ‌రెంట్‌. ఆయ‌న నోటికి ప‌నిచెబుతారు. బూతుల‌తో విరుచుకుప‌డతారు. త‌న మ‌న అనే తేడా లేకుండా.. ఏ విష‌యంపైనైనా.. త‌న నోటికి ప‌నిచెప్పి.. విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

అంతేకాదు.. గ‌త 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నాని నియోజ‌క‌వ‌ర్గంపై కంటే కూడా.. వ్య‌క్తిగ‌తంగా త‌న ఇమేజ్‌ను పెంచుకునే ప‌నిలోనే ఉన్నారు. తెల్లారిలేస్తే.. విప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌డం.. వ్య‌క్తిగ‌తంగా వారిని దూషించ‌డ‌మే ఆయ‌న దైనందిన ప‌నిగా పెట్టుకున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయాలు ఇలానే సాగిపోయాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి లేక పోవ‌డం. బ‌ల‌మైన నాయ‌కుడు ఆయ‌న‌పై పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే.

కానీ, రోజుల‌న్నీ ఒకేలా ఉండ‌నట్టే.. ఇప్పుడు కొడాలి నాని రాజకీయం కూడా మారిపోతోంది. బ‌ల‌మైన నాయ‌కుడు.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే నాయ‌కుడు.. ఇప్పుడు గుడివాడ గ‌డ్డ‌పై త‌న స‌త్తా చాటుతున్నారు. ఆయ‌నే వెనిగండ్ల రాము. గ‌త ఏడెనిమిది మాసాలకుపైగానే ఆయ‌న ఇక్క‌డ త‌న ముద్ర వేస్తున్నారు. టీడీపీ త‌ర‌ఫున ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు. చంద్ర‌బాబు ఆశీస్సుల‌తో ఎన్నారైగా ఉన్న వెనిగండ్ల రాము ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు.

దీనికి ముందే ఆయ‌న గుడివాడలో అనేక సేవా కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఆర్తికంగా బ‌లంగా ఉన్న నాయ‌కుడు కావ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు పెంచుకోవ‌డం.. స్థానికుల‌తో మ‌మేకం కావ‌డం.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే నాని చేస్తోన్న ప్ర‌జా వ్య‌తిరేక ప‌నులు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చేవారిని ఖ‌సురు కోవ‌డం.. మీకు ఎంత చేసినా ప‌ర‌గ‌డుపే అంటూ చీద‌రించుకోవ‌డం వంటివాటికి వెనిగండ్ల చెక్ పెడుతున్నారు. స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారు ఎంత‌టి వారైనా.. ఎంత దిగువ‌స్థాయి సామాజిక వ‌ర్గ‌మైనా.. తాను ముందుంటున్నారు.

మురికి వాడ‌ల్లోనూ వెనిగండ్ల ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రిస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు వివిధ కార్య‌క్ర‌మాలతో ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. వారి స‌మ‌స్య‌లు ఓపిగ్గా వింటున్నారు. ప‌రిష్కారానికి దారులు చూపిస్తున్నారు. ఇదేస‌మయంలో కొడాలి నాని ఫైర్ రాజ‌కీయాల‌కు భిన్నంగా.. ఆయ‌న ఎక్క‌డా విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. ప‌నులు చేసుకుని పోతున్నారు.

నేనున్నాను.. గుడివాడ‌ను మారుస్తాను! అనే నినాదంతో రాము.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ఫ‌లితంగా ఇప్పుడు గుడివాడ‌లో కొడాలి కూసాలు క‌దులుతున్నాయి. వెనిగండ్ల రాక‌తో.. రెండు ద‌శాబ్దాలుగా గుడివాడ అంటే.. బూతుల నేత అనేమాట‌ను చెరిపేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో గుడివాడ‌లో స‌రికొత్త మార్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

sharma somaraju

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

 బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N