NewsOrbit
జాతీయం న్యూస్

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుండే పరిపాలన మొదలెట్టేసినట్లున్నారు(గా)..!

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబందించి మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఇటీవల ఈడీ అరెస్టు చేయడం, కోర్టు ఆదేశాలతో ఆయనను తీహార్ జైల్ కు పంపడం తెలిసిందే. అయితే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ఇంతకు ముందు దాణా కుంభకోణం కేసులో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను అరెస్టు అవ్వగా, ఆయన సీఎం బాధ్యతలను భార్య రబ్రీదేవికి అప్పగించారు.

Arvind Kejriwal

రీసెంట్ గా జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ వెంటనే సీఎం పదవికి  రాజీనామా చేశారు. అయితే కేజ్రీవాల్ మాత్రం న్యాయస్థానం ఆయనకు రిమాండ్, ఈడీ కస్టడీ ఆదేశాలు ఇచ్చినా  సీఎం పదవికి రాజీనామా చేయలేదు. లాకప్ నుండే పాలన కొనసాగిస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోదని, ఆయన పై ఆరోపణలు రుజువు కాలేదని అందుకే సీఎం పదవిలోనే కొనసాగుతారని మంత్రి అతిశీ మార్జీనా వెల్లడించారు.

తాజాగా ఆదివారం జైలు నుండే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి.  ఈడీ కస్టడీ నుంచే ఆయన ఇవేళ తొలి సారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తొంది. దీనిని ఓ నోట్ రూపంలో జలమంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న అతిశీ మార్లీనాకు ఆయన పంపించారు. ఇవేళ దీనిపై మంత్రి మీడియా సమావేశంలో మరింత సమాచారం ఇవ్వవచ్చని తెలుస్తొంది. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుండే పరిపాలన సాగిస్తారని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఇలా చేయవచ్చా.. చేయకూడదా అనే దానిపై రాజకీయ, న్యాయవాద వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. కేజ్రీవాల్ ఒక వేళ రాజీనామా ప్రకటిస్తే ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎం గా ప్రభుత్వాన్ని నడపవచ్చని సీనియర్ బ్యూరోక్రాట్, ఢిల్లీ మాజీ సెక్రటరీ ఉమేశ్ సైగల్ తెలిపారు.   జైలు మాన్యువల్ కూడా ఒక వ్యక్తి కారాగారం లోపలి నుండి ప్రభుత్వాన్ని నడపడానికి అనుమతించదని స్పష్టం చేశారు. మరో వైపు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకుండా ఇదే విధంగా కొనసాగితే కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Russia: రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి .. 60 మందికిపైగా మృతి..

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?