NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Actress Meena: డబ్బు కోసం ఏమైనా రాస్తారా.. రెండో పెళ్లి వార్త‌ల‌పై మండిప‌డ్డ మీనా!!

Actress Meena: ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల తారల్లో మీనా ఒకటి. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలందరితోనూ మీనా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హీరోయిన్ గా గ్రాఫ్ త‌గ్గిన తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సౌత్ సినిమాల్లో సహాయక పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే టెలివిజన్ రంగంలో అనేక టీవీ షోస్ కు జడ్జ్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చేరువవుతున్నారు.

పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను మీనా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె జన్మించింది. అయితే 2022లో విద్యాసాగర్ లివర్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ మరణించారు. భర్త మరణం మానసికంగా మీనా ను ఎంతగానో కృంగదీసింది. చిన్నవయసులోనే ఆమె భర్తను కోల్పోవడం అభిమానులు మరియు సినీ తారలు జీర్ణించుకోలేకపోయారు.

అయితే కూతురు నైనిక భ‌విష్య‌త్తు కోసం మీనా.. భ‌ర్త చ‌నిపోయిన కొద్ది నెల‌ల‌కే మళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చారు. ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో బిజీ అయ్యారు. ఇక‌పోతే గత కొంతకాలం నుంచి మీనా రెండో పెళ్లి చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొందరు ఏకంగా కోలీవుడ్ హీరో ధనుష్ తో మీనాకు రిలేషన్ అంటగ‌ట్టారు. వీరు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ క్రియేట్ చేశారు. మీనా ఎన్నిసార్లు ఖండించినా సోషల్ మీడియాలో ఆమెపై తప్పుడు ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి మీనా రెండో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి.

దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. రెండో పెళ్లి వార్తలు పై స్పందించింది. సోషల్ మీడియా దిగజారి రోజురోజుకు పోతుంది.. డబ్బు కోసం ఏమైనా రాసేస్తారా..? అంటూ మీనా మండిప‌డింది. వాస్త‌వాలు తెలుసుకొని రాస్తే అందరికీ మంచిది. నా తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు రాసే త‌ప్పుడు వార్త‌లు వారిపై ప్ర‌భావం చూపుతున్నాయి. దేశంలో నాలానే ఒంటరిగా జీవించే మహిళలు ఎంద‌రు ఉన్నారు. నాకు అలానే ఉండాల‌నుంది. ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన నాకు లేదు. ఒక‌వేళ రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నేనే మీడియాకు చెబుతాను అంటూ మీనా క్లాస్ పీకింది. దీంతో మీనా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju