Naga Panchami: ప్రస్తుత కాలంలో స్టార్ మా లో ప్రసారమవుతున్న చాలా మటుకి సీరియల్స్ ని ఎండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక కొత్త సీరియల్ ను ప్రకటిస్తూ ఉన్న సీరియల్స్ ని ఎండ్ చేస్తున్నారు స్టార్ మా వారు. సీరియల్స్ కి పెట్టిన పేరు స్టార్ మా అని చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల నుంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతుంది స్టార్ మా. అదేవిధంగా టిఆర్పి రేటింగ్ లో సైతం టాప్ వన్ లో ఉంటుంది స్టార్ మా. అటువంటి స్టార్ మా తాజాగా ఓ సీరియల్ని ఎండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. స్టార్ మా లో ప్రసారమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగపంచమి సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈ సీరియల్లో నటీనటులకి కూడా మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఈ సీరియల్ ని మంచి ట్విస్టులతో కొనసాగిస్తున్నారు. ఒక ఆడపిల్ల పాముగా మారితే ఏ విధంగా ఉంటుంది అనే కథ చుట్టూ ఈ సీరియల్ రూపొందింది. అదేవిధంగా ఆ పాముకి ఒక సాధారణమైన యువకుడితో పెళ్లి జరిగితే ఏ విధమైన కలహాలు ఎదురవుతాయి అనే కథ చుట్టూ ఈ సీరియల్ తిరుగుతుంది. ఇక ఈ సీరియల్ లో పంచమి అండ్ మోక్ష మధ్య పండే రొమాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా రియల్ కపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు. వీళ్లిద్దరి మధ్య ఉండే ప్రేమ ఆప్యాయతలకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ సీరియల్ త్వరలోనే ఎండ్ అవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త చూసిన పలువురు ప్రేక్షకులు..” ఈ సీరియల్ ని ఎం చేస్తే వాళ్లంతా బుర్ర లేని వారు ఎవరు ఉండరు. క్వాలిటీ గా ఉంటుంది స్క్రిప్ట్ వన్ ఇయర్ టాప్ 2 ఉంటుంది. ఎవరు చూడలేని సిచువేషన్ టైం స్మార్ట్ లో పెట్టి టిఆర్పి అయిపోయింది అంటే ఎలా? మాకు ఈ సీరియల్ అంటే చాలా ఇష్టం. ఈ సీరియల్ ని ఆపేస్తే దీని ప్లేస్ లో వచ్చే సీరియల్ ని మేము ఆదరించలేము. దయచేసి ఈ సీరియల్ ని ఎండ్ చేయవద్దు. అలా చేస్తే స్టార్ మా ఛానల్ వారికే మోసం జరుగుతుందని చెప్పుకోవచ్చు.
అందువల్ల ఆలోచించి డెసిషన్ తీసుకోవడం బెటర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా స్టార్ మా లో ప్రసారమవుతూ గుర్తింపు సంపాదించుకున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ని ఇటీవలే సాయంత్రం 6:00 కి షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న టైమింగ్ మారుస్తూ ఈ సీరియల్ ని సాయంత్రం 6 గంటలకు స్క్రీనింగ్చే స్తుంది స్టార్ మా. ఇక నాగ పంచమి ఎండ్ అయిన అనంతరం నిన్ను కోరి అనే కొత్త సీరియల్ ఈ ప్లేస్ లో రానుంది. మరి ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుని నాగపంచమి సీరియల్ ని మర్చిపోయాలాగా చేస్తుందో లేదో చూడాలి మరి.