Small Screen Couple: ప్రస్తుత కాలంలో ప్రేమ మరియు పెళ్లి అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనంతరం అనేక మనస్పార్ధాలు రావడంతో విడిపోవడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణం అయిపోయాయి. ఈ క్రమంలోనే మరో బుల్లితెర జంట కూడా విడిపోతుంది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ముందుగా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. అనంతరం స్టార్ హీరోల చిత్రాలలో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఈయన కూతురు ఇంద్రజ శంకర్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆమె శంకర్ వారసురాలిగా పరిచయం అయ్యి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ఇక మరీ ముఖ్యంగా తలపతి విజయ్ నటించిన విజిల్ సినిమాతో ఇంద్రజ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఇంద్రజాకు దర్శకుడు కార్తీక్ తో మార్చ్ 24న అంగరంగ వైభోగంగా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ మరియు టాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లి మధురై లో జరగగా చెన్నైలో రిసెప్షన్ జరిగింది. ఇక ఇంద్రజ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ ను తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోస్ను కూడా అప్లోడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ కొత్త జంటపై కొందరు ట్రోల్స్ చేపట్టడం మొదలుపెట్టారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ తన జంట పై ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ పై స్పందించింది. ” నాపై ఓ వ్యక్తి అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు. నేను ఆ వ్యక్తి పేరును మర్చిపోయాను. అలాగే స్క్రీన్ షాట్ తీయలేదు. అతను ఏమన్నాడంటే.. మీరు ఇంకెన్ని రోజులుగా జంటగా ఇంటర్వ్యూలు చేస్తారో చూద్దాం. త్వరలో విడివిడిగా ఇంటర్వ్యూకి వెళ్తారు. తొందర్లోనే విడాకులు కూడా తీసుకుంటారు అని అన్నాడు. నాకు నా భర్త మూడు ముడులు వేయడం చూసి కూడా అలా అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది. అసలు వేరొకరి జీవితం పై అలాంటి తీర్పును ఎలా జారీ చేస్తారు. నాకు అర్థం కాక అడుగుతున్నా. విడాకులు తీసుకునే దాన్ని అయితే పెళ్లి ఎందుకు చేసుకుంటాను. మా వివాహం అయ్యి కూడా నెల రోజులు కాకముందే విడాకులు తీసుకుంటారని అనడం ఏంటి.
అయినా నా వ్యక్తిగత జీవితంపై తీర్పు ఇవ్వడానికి అతనికి ఏం హక్కు ఉంది. అతని మాటలకు నాకు చాలా బాధేసింది. ప్రస్తుతం నా భర్తతో సంతోషంగా ఉన్నాను. జీవితాంతం ఉంటాను కూడా. కాబట్టి కొందరు ఇతరులపై ఫోకస్ పెట్టకుండా వారి పనులు చేసుకుంటే బాగుంటుంది ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చూసిన పలువురు..” నిజంగా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఇంతకన్నా గట్టిగా వాడిని పోలీసులకు అప్పజెప్పాల్సింది. అయినా అంత ఈజీగా ఎందుకు వదిలేసారు. ఈ మధ్యన ప్రతి ఒక్కరికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరి పర్సనల్ లైఫ్ గురించి వారు చూసుకుంటారు. మీకు అనవసరం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.