Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ఇష్యూస్ కారణంగా కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సమంత.. ప్రస్తుతం ఆరోగ్యం చక్కదిద్దుకునే పనిలో ఉంది. అయితే తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోషూట్లతో అలరిస్తోంది.
తాజాగా డబుల్ హాట్ నెస్ తో నెట్టింట హీటు పుట్టించింది. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఎద అందాలను హైలెట్ చేస్తూ రెచ్చిగొట్టింది. కుర్చీలో కూర్చొని ఓరగా చూస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. `డిస్నీ ప్రిన్సెస్ గా ఓడిపోయాను.. ఇప్పుడు నేను డ్రాగన్` అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది.
ఇక సమంత షేర్ చేసిన తాజా ఫోటోలు చూసి కుర్రకారు చూపు తిప్పుకోలేకపోతున్నారు. అమ్మడి అందాలకు అల్లాడిపోతూ.. హాట్, ఫైర్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సమంత చివరిగా ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్టర్ చేసిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం సమంత చేతిలో ఎటువంటి సినిమాలు లేదు. కానీ గతంలో చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో సమంత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ జంటగా నటించారు. ఆల్రెడీ ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!