NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనదే గెలుపు – సీఎం జగన్

YSRCP: విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ గెలుపు మనదేనని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఇవేళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. ఈ సభ ఎమ్మినగనూరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని అన్నారు. బిందువు బిందువు చేరి సింధువు అయినట్లు ఇక్కడ జన సంద్రం కనిపిస్తొందని అనారు. మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం మీరంతా రావడం పూర్వజన్మసుకృతం ..అవ్వాతాతలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని జగన్ అన్నారు. పేదలంతా ఒకవైపు పెత్తందార్లు మరొక వైపు ఈ ఎన్నికల్లో ఉన్నారన్నారు. ఈ పొత్తులను జిత్తులను ఎదుర్కొని ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని జగన్ ప్రకటించారు. 58 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు. ఈ ఐదేళ్లు మీ ఇంట్లో మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని జగన్ కోరారు. గత ప్రభుత్వం అన్ని రంగాలను విస్మరించిందని విమర్శించారు.

విద్య, వైద్యరంగాలకు పేదలను గత ప్రభుత్వం దూరం చేసిందని, వారికి దగ్గర చేయడానికే తాను చేసిన ప్రయత్నం సఫలమయిందని అన్నారు. మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పధకాన్ని కూడా తీసుకురాలేదని అన్నారు. విద్యా, వైద్య రంగాలను విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా  అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత విద్య, వైద్య రంగాలపైనే దృష్టి పెట్టామని అన్నారు.

పేదలు చదువుకుంటేనే వారి బతుకులు బాగుపడతాయని నమ్మి తాను విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెచ్చామని జగన్ వివరించారు. ప్రభుత్వానికి రాఖీ కట్టాలని అక్క చెల్లెమ్మలను కోరుతున్నానని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాలను కూడా అక్కచెల్లెమ్మల పేర్లు మీద ఇచ్చామని, వారికి ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నామని తెలిపారు. వారి రక్షణ కోసం దిశ యాప్ ను తీసుకు వచ్చామని తెలిపారు. అందుకే ఇప్పటి వరకూ పేదల ఖాతాల్లో 2.75 లక్షల కోట్ల రూపాయలను జమ చేశామని తెలిపారు.

పింఛను ను కూడా ప్రతి నెల ఒకటోతేదీ ఇస్తున్నామని జగన్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈని కూడా తెస్తున్నామని గుర్తు చేశారు. ధనికులకు అందే చదువును పేదలకు కూడా అందిస్తున్నామని అన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని జగన్ చెప్పారు. సంక్షేమాన్ని ఉద్యమంలా నడిపిన ఈ ప్రభుత్వానికి రక్షాబంధన్ ను కట్టాలని జగన్ కోరారు. అన్ని నియామకాల్లో మహిళలకు అవకాశాలు కల్పించామని తెలిపారు. అక్కచెల్లెమ్మల జీవితాల్లో మార్పు గతంలో ఎన్నడైనా జరిగిందా అని జగన్ ప్రశ్నించారు.

పది సంవత్సరాల మీ బ్యాంక్ అకౌంట్ చూస్తే చాలు ఎవరు మేలు చేశారన్నది అర్థమవుతుందని జగన్ అన్నారు. ప్రతిపక్షం మోసాన్ని నమ్ముకుంటే…ఈ ప్రభుత్వం మంచిని నమ్ముకుందని అన్నారు. కేవలం శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు మాత్రమే కాదని, కోట్ల మంది అక్కచెల్లెమ్మల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని ఆయన అన్నారు. ప్రతి రైతు ఆలోచించాలని, ఐదేళ్లలో రైతుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తించాలని జగన్ కోరారు. ఎన్ని కుట్రలు చేసినా మనమే గెలవబోతున్నామని ఆయన అన్నారు.
కాగా, బస్సు యాత్రలో మూడవ రోజు జగన్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగింది. దారి పొడవునా జనం తన కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పెంచిలకపాడు నుండి శుక్రవారం ప్రారంభమైన బస్సు యాత్ర రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కేరవడి, గోనెగుండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంది. అక్కడ భోజన విరామం తర్వాత సీఎం జగన్ ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటి గ్రౌండ్ బహిరంగ సభకు చేరుకుని ప్రసంగించారు.

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!